Friday, December 25, 2009

The Known Universe - మనమొక్కరమే అంటే నమ్మలేను...

నాకెప్పుడు ఒక అనుమానం ఉంటుంది.. ఈ సృష్టి లో మనమొక్కరమే ఉన్నమా అని? దానికి ఇంకా సమాధానం దొరక్కపోయినా.. ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది - మనమొక్కరమే ఉంటే అంత స్పేస్ ఎందుకు అని.. ఎదో సినెమా లో అన్నట్టు "If we were all alone, that would be an enormous waste of space" అని. అది నిజం. ఈ కింద వీడియో లో చూడండి.. ఇప్పటి వరకు ఇన్నేళ్ళల్లో విశ్వాన్ని మనము మ్యాప్ చేసినది. హబ్బల్ టెలిస్కోప్ తో మిగితావాటితో మనం చూడగలిగినవి అన్నింటిని ఒక చోట పెడితే ఇలా ఉంటుంది..

మధ్యలో భాగం మనం చూడలేకపోతున్నాము. ఎందుకంటే మనము ఈ ధరణి నుండి పైకో కిందికో చూసి అటువైపు ఉండే నక్షత్రాలని చూడగలము. కాని కుడీ యెడమల్లో చూడలంటే మనకి ఆకాశ గంగ లోని ఇతరనక్షత్రాలే కనిపిస్తున్నాయి. అందుకే ఆ రెండు భాగాల్లో ఇంకా మ్యాప్ చేయలేదు. బహుశా ఏదో ఒక రోజు మనము ఆ భాగాలని కూడా ఇంతకంటే సూక్ష్మంగా పరిశీలించచ్చేమో. ఆ రోజుకోసమే చూస్తున్నా.ఈ వీడియో చూసాక ఎవ్వరికైన అనిపించాలి - మనము ఉండే చోటు ఎంత చిన్నది అంటే it is just not worth fighting over petty things. మనవజాతి అంతా ఒక తాటిపై నిలబడి సమస్త జగతిని అభివృద్ధి పరిచేదానికి ప్రయత్నం చేయాలి. అంతరిక్షాన్ని అర్థం చేసుకొని వేరే గ్రాహాల మీద ఇంక ఎవరైన ఉన్నరేమో అని వెతికేదానికి సర్వ శక్తుల ప్రయత్నం చేయాలి. అన్ని కోట్ల కోట్ల నక్షత్రాల చుట్టు ఇంకా కోట్ల కోట్ల భూమి లాంటి గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. అందులో జీవులు ఉంటారన్నది ఖండించలేని వాస్తవం. ఒక ఊహ ప్రకారం వాళ్ళు ఎంత ముందు ఉండింటారంటే వాళ్ళు పంపే సిగ్నల్స్ మనకి అర్థం కావడం లేదు - ఒక చీమకి మన భాష ఎట్ల అర్థం కాదో అలా అన్నమాట. అది కూడా అయ్యిండచ్చు. చూద్దాం.. ఇంకో ఇరవై యేళ్ళల్లో మన సాంకేతిక పరిజ్ఞానం ఆ మాత్రం అభివృద్ధి చెందదా? Hopefully someday we will be able to make contact with the others....Hopefully..

5 comments:

Anonymous,  December 25, 2009 10:29 AM  

interesting points and video !

Kalpana Rentala December 25, 2009 10:56 AM  

మీరు రాసింది అక్షర సత్యం. వీడియో కూడా బావుంది. ఈ అనంత విశ్వంలో మనం పిపీలకాలం అన్న సంగతి మరో సారి గుర్తు చేశారు. అయితే నాకొక చిన్న సందేహం. మిగతా గ్రహాల వాళ్ళు పంపే సందేశాలు మనకు అర్ధం కావటం లేదన్నారు. మనమంటే వెనకబడివున్నాము కాబట్టి వాళ్ళ భాష మనకు అర్ధం కావటం లేదు. కానీ మనమేమీ మాట్లాడుతున్నామో వాళ్ళకు అర్ధమవుతున్నప్పుడు మనకు అర్ధమయ్యే భాషలో వాళ్ళు సిగ్నల్స్ పంపవచ్చు. మనం మాట్లాడేది చీమ కు అర్ధం కాదు. చీమకు అర్ధమయ్యే భాషలో మనం మాట్లాడలేము .ఇది కూడా అలాంటిదే అయితే అసలు వాళ్ళు మనకు సిగ్నల్స్ పంపటం దేనికి? ఆ సిగ్నల్స్ దేనికి పంపిస్తున్నారు? మనకు అర్ధం కాకపోయినా వాళ్ళకు అర్ధం అవుతుంది కదా...మనకు అర్ధం కాదని. జస్ట్ curious.
కల్పనారెంటాల

Shashank December 25, 2009 1:10 PM  

కల్పన - మీరన్నది ఓ అంతుకు నిజమే కాని ఇంకో సారి ఆలోచిస్తే - వాళ్ళు బహుశా మనం ఆ మాత్రం అర్థం చేసుకునే లెవెల్ కి చేరేవరకు మాట్లాడి ప్రయోజనం లేదనుకొని ఉండచ్చు కదా ? ఒకరి భాష ఒకరికి అర్థం కాకపోయినా మనకి వాళ్ళంత సాంకేతిక పరిజ్ఞానం లేదనుకోండి మనకి ఈ విశ్వం లోని మిగితా వాళ్ళని పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారేమో ? లేకపోతే కనీసం you are not alone అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారేమో?
ఇవన్ని నా ఊహాగానాలే .. కాని ఈ విషయం లో నాకన్ని అనుమానాలే.. unanswered questionsసే ..

a2zdreams, harE - నెనర్లు.

హరే కృష్ణ . December 31, 2009 9:46 AM  

Wishing u a happy and prosperous New year shashank

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP