Tuesday, December 22, 2009

ఒక తెలుగు వాడి క్షోభ.

జీవితం లో మొదటి సారి తెలుగువాడైనందుకు సిగ్గు గా ఉంది.. ఇంత ద్వేషం నా జన్మలో ఎప్పుడూ చూడలేదు. మండల్ కమీషన్ అప్పుడు కూడా గొడవలు జరిగాయి కాని ఈ స్థాయిలో ద్వేషం మాత్రం ఎప్పుడూ చూడలేదు. నాలుకలు కోస్తాం అని ఒక నాయకుడు అనడం ఎంత చండాలంగా ఎంత నీచం గా ఎంత దరిద్రం గా ఉందో మాటల్లో చెప్పలేను. ఒక్కడు చేసిన పనికి.. ఒక్కడు వాడి స్వార్థం కోసం మొదలెట్టిన పని ఇన్ని కోట్లమంది కడుపు కొడుతోందో. ఎన్ని వేల కోట్ల వ్యాపార నష్టం .. ఎన్ని జీవితాల నష్టం.. ఎన్ని కోట్ల ఆశ్తి నష్టం.

దీనివళ్ళ ఒరిగింది ఏంటి? ఎవరికి ఏమి ఒరిగింది? హైదరాబాదు లో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు ఇప్పుడు పెట్టరు. ఎంచక్క పక్క రాష్ట్రాలకి వెళ్తారు. ఇంకో పదేళ్ళు ఇటు వైపు కుడా చూడరు.. అదృష్టం బాగుండి అప్పటికి ఓ మంచి నేత వస్తే మళ్ళా హైదరాబాదు గత వైభవం రావచ్చు... లేకుంటే ఒకప్పటి పాట్నా ఎందుకు పనికిరాకుండా పోయేట్టు పోవచ్చు. చెప్పలేము. అప్పుడు కోస్తా సీమ వాళ్ళే కాదు తెలంగాణా వీరులుకూడా హైదరాబాదుకి రారు.. వచ్చి ప్రయోజనం ఉండదు కనుక.

ఎవరో తెలుగుతల్లి ని దూషించారు.. ఇంకొంతమంది అమరజీవి పొట్టి శ్రీరములని తిట్టిపోసారు.. చెప్పుల హారం వేసారు.. ఇంకొంతమంది అమ్మవారికి మాండలీకం అంటగట్టారు.. కోస్తా నుండి వచ్చింది అని ప్రసాదం స్వీకరించలేదు... వెంకన్న సీమలో వెలసి ద్రోహం చేసాడు అని సాక్షాత్తు ఆ కలియుగ దైవమైన వేంకటేశ్వరున్ని అనరాని మాటలన్నారు. థూ మీ బ్రతుకులు... అన్నింటిలోనూ అన్ని చోట్ల అణువూఅణువున ఉండే ఆ దైవానికే ప్రదేశాలు అంటగట్టి దూషించేవాళ్ళకి బుద్ధి ఉంటుంది వస్తుంది అని నేను ఆశించను. ఇంత ద్వేషాన్ని నేను ఎప్పుడు చూడలేదు. తెలుగు జాతి అనేది ఈ క్షణం అంతరించిపోతే బాగున్ను అనిపిస్తుంది. అంత సిగ్గు పడుతున్నాను. "ఆత్మ గౌరవం" అనేది ఇంకో సారి అనకుండా అదః పాతాళానికి తొక్కేసాము. ఇన్నేళ్ళా పురోగతి ఒక్క నెలలో ఒక్కడి దీక్షా నాటకం వలన నాశనం అయిపోయింది. ప్రతి తెలుగు వాడు ఆంధ్రూడే అని గ్రహించని మూర్ఖులకి ఏం చెప్పగలం?

రాజకీయ స్వార్థం కోసం రచించిన ఈ దరిద్ర నాటకానికి తెర ఎప్పుడు ఎలా పడుతుందో నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. దీనివళ్ళ ఎవరికి ఏం ఒరుగుతుందో తెలీదు. ఇంత స్వార్థం ద్వేషం మాత్రం యే జాతికి పట్టకూడదు. కాని ఒక్కటి మాత్రం నిజం తెలుగువాదైనందుకు జీవితం లో మొట్టమొదటిసారి సిగ్గు పడుతున్నాను. శాస్త్రి గారి 'తలయెత్తి జివించు తమ్ముడా తెలుగునేలలో జమ్నించినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని" అని మాత్రం ఈ జన్మలో పాడలేము. ఇంత నెగటివిటి (negativity) నేను భరించలేను. తెలంగాణా వచ్చినా రాకున్నా.. ఆంధ్ర రాష్ట్రం ఉన్నా లేకున్న.. i just will not give a hoot anymore. నేను పట్టించుకోకుండ ఉన్న్న మాత్రానా ప్రపంచానికి ఒరిగేది ఏమీ లేదు.. కాని at the very least I wont be a part of that negativity. అంతే చాలు నాకు.
జై తెలుగు తల్లి.

29 comments:

Anonymous,  December 22, 2009 11:50 AM  

Well said.

Sravya Vattikuti December 22, 2009 12:19 PM  

నిజం ఇంత నీచమా నీచమా ఛీ ఛీ !

నాగప్రసాద్ December 22, 2009 12:24 PM  

మరేం ఫర్లేదు. మనం నిరాశ పడక్కర్లేదు. సిగ్గు పడక్కర్లేదు. మళ్ళీ మన తెలుగువాళ్ళ పేరు నిలబెట్టుకుందాం.

జరిగిన పరిణామాలనుంచి మనం ఎప్పుడూ మంచినే ఆశిద్దాం. ఇకనుంచైనా నాయకులు అక్కడొక మాట, ఇక్కడొక మాట మాట్లాడకుండా వాళ్ళ వాళ్ళ అజెండాలతోనే ప్రజలలోకి వస్తారు. ప్రజల మనోభావాలతో ఆడుకోవడానికి ధైర్యం చేయరు.

అలాగే, కేవలం ఒక ప్రాంత అభివృద్ధికే కాకుండా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమన్యాయం పాటిస్తారని ఆశిద్దాం. తెలుగు వారందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ వెంకన్నను వేడుకొందాం.

జై తెలుగు తల్లి.

విరజాజి December 22, 2009 12:55 PM  

ఎవరో కొందరు పిచ్చిగా మాట్లాడారని అందరూ తెలంగాణా వాళ్ళని నిందించలేము. ఆ నాయకుడికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వబడుతోందో కాస్త అలోచించాలి. మీకు వీలుంటే ఈ లంకె కి వెళ్ళి తాడేపల్లి గారి వ్యాసాలన్నీ చదవండి.

http://www.tadepally.com

Shashank December 22, 2009 1:20 PM  

విరజాజి గారు - నేను తెలంగాణా వాళ్ళని ఏమి అనలేదు కద. రాజకీయ నాయాకులనే అంటున్నా..

నాగప్రసాద్ - అదే ఆశ. అది జరిగేవరకు ఇలానే..

శ్రావ్యా - కొంచం విడమర్చి చెప్తారా? కొంచం కంఫ్యూషన్ గా ఉంది నాకు.

పులి- నువ్వు రాసింది ఏమి కనిపించడం లేదు.. ఎందుకు??

శోమశేకర్ - అంతే కద. hope.

హరే - :)

శరత్ 'కాలమ్' December 22, 2009 1:38 PM  

మీ వ్యధ చూసి ఏం మాట్లాడాలో తెలియక చుక్క పెట్టా అంతే.

Madhumitha,  December 22, 2009 2:53 PM  

I completely agree with you Shashank. Naaku kuda VAADINI chusthe ummeyalani anipisthundii..vaadu nijanga ghoramaina chaavu chasthaduuu/chaavali ani nenu roju mokkukuntunnaa..Just for the benefit of some politically unemployed people entha nastham vasthundii rojukii..I cannot tolerate anyone/any discussion supporting Telangana..Its just baseless.

BTW - I am from Telangana

Anonymous,  December 22, 2009 4:38 PM  

naaku intavarau telangana valla gurinchi teliyadu. ippudu telangana vallu behaviour ni choosi naaku telagana vaallu antey pakistan valla laaga anipistunnaru.. I now hate telangana people. ( but still there are good people in Telangana )

Veena,  December 22, 2009 5:27 PM  

baaga cheppav, asalu news chadavaali ante virakthi vasthondi ee madhyana

Anonymous,  December 22, 2009 6:04 PM  

ఈ అంశాన్ని మీరు మరీ హర్ట్ కు తీసుకున్నారు. "ఏది జరిగినా మన మేలే", "మనిషి ఎప్పటికైనా ఒంటరి వాడే" అని అనుకుంటే ఏ బాధా వుండదు.

Shashank December 22, 2009 6:42 PM  

మధుమిత - బా చెప్పారండి. btw నేను తెలంగాణా వాడినే.. తెలంగాణా వాది ని కాదు అంతే.. మీ లాగే.

anon - మరీ అంత అంటారా? ఏమో.. మీ అభిప్రాయం తప్పో ఒప్పో నేను చెప్పలేను.. ప్రస్తుతానికి నాకు మించు ఇంచు అలనే ఉంది.. పరమ చిరాక్గా..

అక్క - ఉన్న మాటే కదా.

a2zdreams - తె.రా.స వాళ్ళు అనే మాటలు విని "అంతా మన మచింకే" అని అనుకొని ఎల ఉండమంటారు? వాళ్ళభిప్రాయాన్ని చెప్పే పద్ధతి అదేనా? నాలుకలు కోస్తాం .. తరిమి తరిమి కొడతాం.. ఇవి విని - "భలే భలే" అని సంకలెగెరేసుకోమంటారా? చెత్త నా __ లా మాట్లాడుతున్నారు వాళ్ళు.

Sravya Vattikuti December 22, 2009 7:07 PM  

శ్రావ్యా - కొంచం విడమర్చి చెప్తారా? కొంచం కంఫ్యూషన్ గా ఉంది నాకు. >>
అయ్యో శశాంక్ గారు నా ఉద్దేశ్యం టీవీ లో ఆ న్యూస్ చూస్తుంటే చాలా చండాలంగా అనిపించింది అని !

Shashank December 22, 2009 8:38 PM  

శ్రావ్యా - కరెష్ట్ గా చెప్పారు. నా అభిప్రాయం కూడా అదే. ఈ వెధవల వళ్ళ చక్కని నా రాష్ట్రం విధ్వంసం ఔతోంది..

mI blog lo comment cheeyaleekapoya .. oo paari test chestara?

మంచు పల్లకీ December 22, 2009 9:49 PM  

ఈరోజు దొరగారి నోటి నుండి రెండు కొత్త బూతులు వచ్చాయి. "బేవకూఫ్" , "లఫంగి " ...
http://eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel5.htm

Anonymous,  December 23, 2009 12:02 AM  

శశాంక్, అంత ఆవేశం అవసరమా?

గత అయిదేళ్ళనుంచి ఎన్నిసార్లు ఈ నాటకాలు చూడలేదు?

కాకపోతే ఈ సారి కధ అడ్డం తిరిగింది, కొంచెం.

కొద్దిరోజుల తరవాత అంతా మామూలే.

AMMA ODI December 23, 2009 12:28 AM  

ప్రజలు ఏ రాజకీయ నాయకులని నిలదీసే రోజు రావాలి. అప్పుడే నిజమైన అభివృద్ది వస్తుంది. అప్పటి వరకు మనకి ఈ అనుమానాలు తప్పదు, అవమానాలు తప్పదు.

viswamitra December 23, 2009 7:47 AM  

కేసీఅర్ రాజకీయ వాతావరణాన్ని కల్మషం చేసాడు. ఒక ధ్యేయంతో పోరాడటం సమర్ధించవచ్చు గానీ ఆయన మాటలవల్ల ప్రజల మధ్య నాయకుల మధ్య సున్నితమైన పొర తెగిపోయింది.

Anonymous,  December 23, 2009 6:10 PM  

viswamitra, I am confused. are you joking ? or serious ?

Anonymous,  December 24, 2009 12:35 AM  

KCR is a stupid fellow, but what ever he gave life to our TELANGANA REVOLUTION. I hope we will reach our FINAL DESTINALTION. mee andhra vallanu minchina oosaravellulu lerani marokka saari rujuvu ayyindi ... 9th Dec 2009 morning ASSEMBLY lo BILL pettandi memmu support chestham ani chepppi maata marchina GHANATHA meedee.... asalu atla maata marchina vallaki nannalu entha mandi ani adagalani undi naaku......

TELANGANA lo unna valle TENALAGANA ki support cheyyakunte inka ekkada vasthundi .... suggu undali... ANDHRA vallaki support cheyyaneeke.. thuuuu mee bathuku ... enduku meeru bathikedi .... ________________________ ee dash loo emi rasukuntaaro mee istham.... asalu ANDHRA vallu UNITED gaa endukundaalo chepthaleru .. vallani support cheyyaneeku meeku manasu etla vacchindi ..... SO SAD

ALL YOU BASTARDS - This final word goes to those who agreed on TELANGANA and opposed later and those who ever talking/using some rude words on TELANGANA people.


Cheers
Jai Telangana

Shashank December 24, 2009 8:51 AM  

dhairyam leeeni oo telangana veeruda...

neenu telugu vaadini ante andhrudani ani artham. ee mukka ee janmalo nee matti burraki artham kaadu kaani.. bayataki velli prajala sommu tagalettu. vellu babu... vellu...

viswamitra December 24, 2009 10:44 AM  

@a2zdreams:
నేను నిజంగానే చెపుతున్నాను. మనిషికి మనిషికి మధ్య ఉండే సున్నితమైన బంధాన్ని తన మాటలతో తెంచేశాడు. ఈరోజు తెలంగాణా ప్రజలు ఆంధ్రా ప్రజలు ఒకరినొకరు విమర్శించుకొనే స్థాయికి కారణం అతడే.

Shashank December 24, 2009 12:17 PM  

viswamitra - correct ga chepparu. i wish someone sues KCR and TRS for all the destrcution and the loss of so many crores of business. evaraina PIL veste bagunnu.

Anonymous,  December 24, 2009 3:30 PM  

viswamitra,

1.మీరు చెప్పిన మొదటి కామెంట్ కు , రెండో కామెంట్ కు చాలా వత్యాసం వుంది.

2.both cases, I can't agree with you.

Anonymous,  December 25, 2009 2:30 PM  

hi Shahank,
People in Telangana region are not thinking that they are part of AP. I hope you understand that. This is happened because of cheating by you all ANDHRA & RAYALASEEMA bastards, who cheated Telanaga people again which you were doing since more than 40 years.

http://www.youtube.com/watch?v=vtYJEDUC0Qk

If possible, try to watch this video, who changed his vioce because of you all bastards who are following the people who invested money in HYD and acting like JOKERS (LAGADAPATI)

Jai Telangana

Shashank December 27, 2009 7:31 AM  

Anon - noru paaresukovadam sulabham. even i can do it. you bastards ani. and telangana vallani "mosam" chesindi prajalu kaadu. i hope u get this thru your thick skull. if u can understand this small thing everything else can be resovled. but i dont think u will ever understand since ur head is full of hate dude. get a chill pill.
and whatever made u think i was not from telangana? i was until this issue RUINED AP. ippuDu neenu oka "andhrudani". u will never understand that telugu and andhra are synonyms.
5000 crore loss is not a small thing. blame it on KCR who F****ed AP.

Anonymous,  December 28, 2009 2:47 AM  

Shashank,
TELANGANA kosam poratam start ainappudu leni noppi ANDHRA & RAYALASEEMA valalki statement cheshinappudu enduku vacchindi?? Because, no one thought that central will give that statement. You people are cheating youselves... you don't want to be united. But the only thing you are concerned is,

ANDHRA - WATER from KRISHNA & GODAVARI rivers

RAYALASEEMA - HYDERABAD

This is the face you all need to accpet. You are sating that.. we want to be united but not saying any reason. All the politician are saying that, people from TELANGANA want to be UNITED. Then, why don't they do some "BUD YATRA or FAST UNTIL DIE" kind of things in TELANGANA.

They know that, they wil not get response here which KCR got in TELANGANA. Please never/ever judge by taking some stupid fellows opinions (who stays in TELANGANA and fights for UNITED ANDHRA)

This is for those who are staying in TENALGANA and supporting UNITED ANDHRA - Please come to our dtsticts NALGONDA & MAHABOOB NAGAR and see the situation there. KRISHNA river is going thru these districts (N.SAGAR dam is in NALGONDA, but having floride problem since decades). See ADILABAD, NIZAMABAD, KARIMNAGAR districts... GODAVARI river is going thru these palces... we are not using much water because of lack of reserviors. Where GODAVARI districts ppl are using this water and getting two-thres crops a year. How my TELANGANA people will become rich like you???. If we are not get SEPARATED, we will never be rich. Give a damn to RICH we can't even live our lives.

Let me give one example - How do you feeel....if the water is flowing from your footsteps, but you are not allowed to drink/use it??? The same is with my great TELANGANA people.

"PORATAALA GADDA NAA TELANGANA"

JAI TELANGANA

Shashank January 04, 2010 1:04 PM  

Anon -

kosta vallu dochesaaru antunaaru kadha: one, YSR time lo major irrigation projects lo 5000 crores telangana ki, 2900 crores kosta ki, 2200 crores rayalaseema ki ketayinchaaru. Pranahita-chevella, etc. projects Nizamabad, Adilabad regions ki chaala upayogakaramyna projects. karimnagar prastutam vari pandinchadam lo godavari districts taruvaata sthanam lo vundhi (because of sriram sagar project). Jalayagnam lo major share Mahabubnagar (kalvakurthi,nettampadu, bhima, etc. projects)... intha importance Telangana region ki istunnaru.. Godavari waters dochesaamu antunnaru - assalu godavari water telangana vallu ela use chesukogalutaaranukuntunnadu aa Idiot KCR? Telangana godavari level kanna height lo vundhi. anduke intha kalam akkada ye vidamyna major projects lekunda poyayi.. Lift irrigation methods world ekkada antha success rate lekapoyinappatiki, YSR telangana ki edo cheddam ani cheppi avi start chesaadu. Godavari zillala lo 150Rs ki oka ekara bhoomi tadustunnte, telangana lo 1500Rs karchupettalsivastundhi... ayina sare, Telangana bhaagupadali ani ettipothala padakaalu start chesaaru.. inni chesina vallaku ekkadam ledu!

Hyderabad gurunchi vaste,, hyderabad mummatiki telangana loni dhe, kaani adhi mummatiki develop chesindhi kosta vallu. ippudu akkadi vellipomante, dochukune vallu telangana valla? kosta valla?

Janalu verri gorrellu! KCR eppudo BC naati kaburlu cheppi, andarini rechagodutunnadu.. Andhra state form ayyetapidiki Telangana Nizam valla paripalana lo bhayakaram ga tokkabadindi..oka vidam ga kosta koncham developed ga vundadaaniki kaaram British govt rule lo vundadame! 1950s ki Nalgonda lo okka school kooda vundedhi kaadu, ippudu 5000 high schools varaku akkada vunnayi.. AP state form ayina taruvaata ekkuva karchu Telangana prantam variki iccharandhi maatram vastavam..

Inka samaykandhra gurunchi vaste, pedda comedy chesaaru, aa lagadapati gaadu vallantha! Samaykam ga vundali ani ippudu gurtukochindi andariki? very funny! aa maata few years back aa KCR gadu extras chestunnappude analsindhi... votes kosam evari svardam vallu choosukunnaru.. ippudu AP ila tayaruchesaaru..

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP