Monday, March 16, 2009

ఈ సారి...

మళ్ళి ఎన్నికల సమయం వచ్చేసింది. వోట్ల కోసం మన రాజకీయ నాయకులు పడే పాట్లని చూస్తూంటే భలే ముచ్చట్టేస్తుంది. నోటికొచ్చినన్ని మాటలు, కంటికి కనబడని వాస్తవాలు, విపరీతంగా అప్పుచేసిన సరిపోని వాగ్ధానాలు - ప్రతీ పార్టి అదే పద్దత్తి. ఈ టపలో నేను ప్రతి రాజకీయ పార్టీ ని విశ్లేసించడం లేదు చేస్తానని వాగ్ధానం కూడా చేయడం లేదు.. కేవలం నా అభిప్రాయం మాత్రమే చెబుతున్న.
మొదట్లో చిరంజీవి పార్టి పెట్టినప్పుడు తిరుపతి లో అతని మాటలు విని చాలా ఆనందించాను మొట్టమొదటి సారి ఎవరైన కులాల గురించి కాదు ఆర్థిక వర్గాల గురించి మాట్లాడారు అని.. పోలీసుల గురించి వారికి అందించాల్సిన సదుపాయాల గురించి మాట్లాడారు అని.. కాని అదంతా కేవలం ఆ speech కే పరిమితం అయ్యయి అని తెలుసుకునేదానికి ఎక్కువ సమయం పట్టలేదు. పేరుమోసిన గూండాలు వేరే వేరే పార్టీల నుండి వలస వచ్చిన రాజకీయవేత్తలని చూస్తే అర్థం అవుతుంది ప్ర.రా.పా మిగిలిన వాళ్ళ లాగానే మరొకటిగా మరిందని. దానికి తోడు ఉచిత వాగ్ధానాలు. అబ్బో ఇంక వాటి గురించి ఎంత తక్కువ చెబితే అంథ మంచింది. దానికి తోడు ప్రతి విషయం లో జాతిని బట్టి మాట్లాడ్డం.. కొత్తదననికి తావు లేకుండా భలే set చేసేసారు. కొత్తదనం అంటే గుర్తొచింది.. ప్రె.రా.పా కొత్తగా రాజకీయాల్లోకి తెచ్చింది - direct గా బూతులు తిట్టుకునే పద్దత్తి. రోజ - శోభ ల మాటలు వింటే తెలుగు తెలిసినందుకు, దేవుడు కనులకి రెప్పల్లు ఇచ్చినట్టు చెవులకి మూతలు ఎందుకు ఇవ్వలేదనందుకు (జై జంధ్యాలా) బాధ వేస్తుంది. వీళ్ళు మనని పరిపాలిస్తారట!! బూతులు ఎంత వస్తే అంత త్వరగా సీటు ఇస్తరేమో..
పోతే.. (అంటే నేనో ఇంకొకళ్ళో కాదు సుమీ) తె.దే.పా, కాంగ్రెస్స్ గురించి చెప్పనే చెప్పక్కరలేదు. వాటి గురించి అయితే ఒక్కొక్కొదానికి ఒక్కొక్క టపా తప్పదు. కమ్యూనిస్ట్ల గురించి అయితే వాళ్ళకి pro-china అని ఏది అనిపిస్తే అదే వాళ్ళ మానిఫెస్టో.
ఇంక మిగిలింది లోక్ సత్తా. జేబులో దారిద్ర్యం ఉన్న ఆలోచనా దారిద్ర్యం లేని ఏకైక పార్టి. రాష్ట్రం గురించి దేశం గురించి ఆలోచిస్తున్న పార్టి. వీళ్ళు చండలమైన వాగ్ధానాలు చేయలేదు.. చేయలేరు కూడా. రాజకీయాల్లో నిజాయతీకి తావు లేదు అని చెప్పెడానికి ఇదొక్కట్టే సరిపోతుంది. పాపం campaign కి కూడా సరిగ్గా డబ్బులు లేని పార్టి..కాని దేశం పురోగతి చెందాలంటే వీళ్ళకే వోటు వేయాలి. ఒక్క సీటు గెలవకపోయినా మనఃసాక్షి గెలుస్తుంది అని నా అభిప్రాయం. మన రాష్ట్రాన్ని / దేశాన్ని ఇంకా అప్పుల్లో ముంచేవాళ్ళకి వోటు వేయలేదు అన్న సంత్రుప్తైనా వస్తుంది. అందుకే ఈ సారి నా వోటు వీళ్లకే.

1 comments:

జీడిపప్పు March 17, 2009 9:06 PM  

Good start అన్నా. పేరాలుగా విడగొట్టు, వీజీగా ఉంటుంది చదవడానికి.

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP