Wednesday, March 25, 2009

కేవలం ఎనిమిది..

ఎనిమిది .. సంఖ్య చిన్నదే అయినా ఎంత తేడా చేస్తుందో. గెలుపుకి ఓటమికి తేడా 'ఒక్క ఇంచే' అని రాజీవ్ కనకాల అరిచి అరిచి చెప్పాడు.. అలాంటిది 8 అంటే కొంచం ఎక్కువే తేడా అనిపిస్తుంది. కాని 545 లో 8 అంత పెద్ద సంఖ్య కాదు. మన దురద్రుష్టం ఆ 8 అటు పడింది.. అదే ఇటు పడింటే కథే వేరుగా ఉండేది. ఎనిమిది సంఖ్య ప్రాధాన్యత గురించా ఈ టపా అనుకోకండి.. గత ఎన్నికల్లో ఈ సంఖ్య చేసిన తేడా గురించి చెప్తున్నా.

బహుసా చాలా మంది ప్రకారం మనం అంటే అంధ్ర ప్రజలు, దేశానికి నష్టం చేకూర్చాము. మన కష్టాలు మనకి ఉంటే ఇదేలా చేసాం అని ఆలోచిస్తున్నారా? ఇదేదో రాకెట్ సైన్స్ కాదు.. గత ఎన్నికల్లో కాంగ్రెస్స్ గెలిచిన ఏకైక 'పెద్దా రాష్ట్రం మనదే! చంద్రబాబు ని ముఖ్యమంత్రిగా చూసి చూసి బొరు కొట్టి మనం మారిస్తే దాని ప్రభావం యావత్ దేశం మీద పడింది.. ఆ 29 సీట్లే కాంగ్రెస్స్ ని లోక సభ లో అతి పెద్ద పార్టీ చేసింది. 29 కూడా కాదు కేవలం 8. (భారతీయ జనతా పార్టి కి 137 సీట్లు, కాంగ్రెస్స్ కి 145 సీట్లు వచాయి గత ఎన్నికల్లో). 9 యేళ్ళ తె.దే.పా పరిపాలన తో విసుగెత్తో చెం.బా. చేసిన అప్పులతో విసుగెత్తో మనం ఎదో మిగిలిన దిక్కుగా వై.యెస్.ఆర్ ని ఎన్నుకున్నం.. పనిలోపనిగా లోక సభ కి కూడా కాంగ్రెస్స్ కే వేసేసాం దానితో మొదలైంది కేంద్రం లో UPA పరిపాలన.

1989 ఎన్నికల నుండి చూస్తే కాంగ్రెస్స్ 1991 sympathy wave లో తప్ప ఎప్పుడు 200 సీట్లు దాటలేదు. పైపెచ్చు వోట్ల శాతం కూడా 1991 నుండి 30 దాటలేదు. 1996 నుండి అయితే 141 సీట్లని మించి రాలేదు.. ఐతే సోనియామ్మ కీ సీతారాం కేసరి కి తేడా ఏంటో? ఈ ప్రశ్న కి జవాబు కేవలం కాంగ్రెస్స్ వాదీయులే చెప్ప గలరేమో!! 2004 ఎన్నికల్లో చిన్న చితక రాష్ట్రాలని గెలుచుకొని 145 సీట్లు సాధించింది కాంగ్రెస్స్. అతి పెద్ద పార్టి కావడం వళ్ళ వాళ్ళనే ఆహ్వానించారు. ఈ సారి మన రాష్ట్రం లో 29 సీట్లు కాంగ్రెస్స్ కి రావడం చాలా కష్టం అనిపిస్తోంది. మహకూటమి, ప్రె.రా.పా సంగతి ఎలా వున్నా.. వై.యెస్.ఆర్ మరియూ జగన్ నిర్వాకాలు చూసి ఆంధ్ర ప్రజలు మళ్ళి వాళ్ళకే పట్టం కట్టడం కష్టం.

నా అంచనా ప్రకారం అయితే భా.జ.పా 180 సీట్ల కంటే ఎక్కువ గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కాని భారత ప్రజానికాని గురించి ఎం చెప్పగలం? ఐదేళ్ళు మోడి ప్రధానమంత్రి అయితే మన దేశ భవిషత్తే మారిపోతుంది. కాని అది జరగడం ఆసాధ్యంగా అనిపిస్తుంది. చూద్దాం. ఏ నిమిషానికి ఏమి జరుగునో....

2 comments:

జీడిపప్పు March 25, 2009 10:28 PM  

బా.జ.పాకు సరి అయిన నాయకులు లేకపోవడం పెద్ద లోటు. మళ్ళీ మనకు సోనియా మాతే దిక్కు అనుకుంటా.

Shashank March 25, 2009 10:56 PM  

@బుడుగు - అల అనకు. అరుణ్ జైట్లే, మోడి, యెడ్యురప్ప గట్ర ఉన్నారు భా.జ.పా లో. కానీ రాజస్థాన్, ఉ.ప్ర, బీహార్ లో ఎలా ఉందో హవా తెలీడం లేదు. వాటి మీదే ఆధారపడుతుంది ఈ సారి ఎన్నికలు..

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP