Friday, March 20, 2009

క్రొత్త పార్టీ - భాగ్యనగర ప్రజా పార్టీ

పాత రోజుళ్ళో లాగ కాకుండా ఈ నాడు ఎంత తక్కువ సీట్లు ఉంటే అంత ఉత్తమం. లేకపోతే రెండే రెండు సీట్ల తో కమ్మునిస్ట్లు ఒర్రిస్సా లో చేసిన ఆర్భాటం చూస్తే వాళ్ళకి ఒక పాతిక సీట్లు ఉన్నయి అనిపిస్తుంది. నావీన్ పట్నయక్ కి బహుసా ఏం చెప్పలో అర్థం కావడం లేదేమో. లేకపోతే ఎన్నికల్లో 7 గెలుచుకున్న వాళ్ళకి ఈ సారి 35 కావాలట! కేంద్రం లో కూడా వీళ్ళ 60 మంద తో చాలా గోల చేసారు నాలుగేళ్ళు. బహుసా కమ్మున్స్ట్లకీ తెలుసనుకుంటా ఇంక జీవితం లో మళ్ళి ఇన్నేసి స్థానాలు గెలవరు అని. (నన్నడిగితే వాళ్ళ వల్ల నష్టమే కాని లాభం ఏమి ఉండదు).

నేనూ ఇలాంటిదే ప్లాన్ చేస్తున్నా.. తె.రా.స లా ఏదో ఒక sentiment ని రెచ్చగొట్టి ఒక 10 సీట్లలో గెలిస్తే 5 యేళ్ళల్లో కనీసం ఒక 2000-3000 ఎకరాలు + 40-50 కోట్ల రూపాయలు నొక్కేయాలని. చాలా సేపు ఆలోచించగా ఒక మహత్తరమైన ఉపాయం తోచింది. తెలంగాణా sentimentకోసం చాలా మందే కొట్టుకుంట్టూనారు.. అందుకని తెలంగాణా ఆధారంగా నా పార్టీ ని గెలిపించలేను.. so "జై భాగ్యనగరం" అంటున్నా!!! "భాగ్యనర రాజ్య పార్టీ" ని తదనుగుణంగా స్థాపిస్తున్న అని సభాముఖం గా తెలియజేస్తున్న.
(ప్రజా రాజ్యం లో రాజ్యం, భా.జ.పా నుండి పార్టీ, తె.రా.స నుండి ఆలోచన కొట్టేసీ పార్టీ పెట్టేసా - నా మేధస్సే మేధస్సు!)

మా పార్టీ మానిఫెస్టో ఇంకా ముద్రణ లో ఉండడం వళ్ళ ఆవిష్కరించలేకపోతున్న. కాని అగెండ లోని కొన్ని కీలక అంశాలు :

* భాగ్యనరాన్ని వేరే రాష్ట్రం గా చేయాలి. దానికి ముఖ మంత్రి నేనే అవ్వాలి. (ఈ విషయం లో ససేమిరా no compromise)

* ఇక్కడ కంపనీ పెట్టలంటే నాకు ముందుగా ఒక 100 ఎకరాల భూమి (మిగిలిన ఆంధ్ర రాష్ట్రం లో ఎక్కడైనా పర్లేదు) + 10 కోట్లు ఇవ్వాలి. ఇప్పుడున్న కంపనీలకి కొంచం concession ఇస్తాము.

* ఇప్పుడు నివసిస్తున్న వాళ్ళలో ఎవ్వరిని వెళ్ళగొట్టము లేండి - అంటే ఎవరైతే "హైదరాబాదు" ని "హైదరాబాదు" అంటారో వాళ్ళు నిస్సంకోచంగా ఉండచ్చు. "హైడ్రాబాడ్" అనేవాళ్ళకి మాత్రం మా "భాగ్యనర రాష్ట్రం" లో చోటు లేదు.

* ఇప్పుడున్న శాసన సభ స్థలం కావాలంటే భాగ్యనగరేతరులే పెట్టేసుకోండి. ఇంకా కావాలంటే తెలంగాణా శాసనసభ, ఖమ్మం శాసనసభ, రాయలసీమ శాసనసభ etc కి కూడా భాగ్యనరం లోనే చోటిస్తాము - ఎదో పెతీ యాడాదికో నెలకో వారానికో ఇంత అని పన్ను కట్టమంటమనుకోండి. అది వేరే విషయం.

ఇల ఇంక్కొన్ని అంశాలు ఉన్నయి మా అగెండాలో. ఏది ఏమైనా ఈ sentiment ని రెచ్చగొట్టి క్యాష్ చేసుకోవాలి ఈ ఎన్నికల్లో.. ఇంతటి అద్భుతమైన ఆలోచనా-ట్యాంక్ బండ్ల (ఆలోచనాతరంగాలు type) మా పార్టీ లో సభ్యత్వం కోరేవారు సంప్రదించ ప్రార్థన. (సభ్యత్వ ఫీసు just 116 డాల్లర్లు మాత్రమే - ఒక్కసారి 10 సీట్లూ గెలిచాకా అంతకంత సంపాదించచ్చులేండీ)

3 comments:

sudheer March 31, 2009 6:56 AM  

మీ పార్టి లొ నెను ఒక బాగస్వామిని కావలి అని కొరు కుంటున్నాను
కొంచము డాలరు విలువ ఎక్కువగా వుండటము వలన రుసుముని కొంచము తగించు కొనగలరు దానికి బదులుగా మీకు మీ పార్టికి నెను మద్దతు తొ పాటు విరాళముగా గొదావరి తిరములొని పాపి కొండలు దాని చుట్టుపక్కల ప్రాంతాలు రాసి ఇస్తాను దానికి తగ్గటుగా మీరు నాకు మీ పార్టిలొ సభ్యత్వము మరియు హైదరాబాదు లొని ఒక్క ప్రాంతము (జూబ్లి హిల్స్) నకు నను మీ పార్టి తరపున నిలబెట్ట వలసిన్నది గా కొరుచున్నాను

Shashank April 06, 2009 8:25 AM  

సుధీర్ గారు - పాపి కొండలకి బదులుగా జూబ్లీ కొండలు కావాలా. సరే.. మీరంతగా అడుగుతున్నారు కాబాట్టి ఇచ్చేస్తా. మన పార్టీ జూబ్లీ హిల్ల్స్ నుండి మీరే అభ్యర్థి. అంబర్పేట్ తప్ప ఎదైన ఓకే నాకు. ;)

శరత్ 'కాలమ్' December 08, 2009 1:23 PM  

భాగ్యనగర రాజ్య పార్టీ జిందాబాద్.

హ్మ్మ్. ఇలా ముఖ్యమత్రి పదవికి ముందే మీరు డెసైడ్ అయిపోయి పార్టీ పెట్టడం ఏమీ బావోలేదు. సరే, ఏం చేస్తాం. సిద్ధాంత కర్త పదవి అన్నా ఖాళీగ వుందా?

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP