Thursday, April 9, 2009

ఎకానమి -3 : డెరివేటివ్స్ & CDOs

ఈ CDO లు లను ఐ-బ్యాంకులు ఎంచక్క అమ్ముకుంటున్నాయి. ఇదే పథం లో అతి పెద్ద ఐదు ఐ-బ్యాంకుల్లో ఒకటైన జె.పీ. మార్గన్ చేస్ (జె.పీ) లో కొందరికి ఒక మహత్తరమైన ఆలోచన మొలిచింది. ఆ ఆలోచనా ప్రతిరూపమే CDS. మామూలుగా, అంటే నిజ జీవితం లో అన్నమాట, మనం ఏదైన వస్తువు (ఉ|| మిక్సీ అనుకుందాం) కొంటే, అది ఎక్కడ పాడైపోతుందో అని కొన్ని సార్లు ఇన్సూరెన్సె కొంటాం. ఆ ఇన్సూరెన్సె మనం కొన్న వస్తువుకి వర్తిస్తుంది. ఔన? ఈ CDS కూడా మించు ఇంచు అలాంటిదే!!

CDS అనగా Credit Default Swaps. ఈ సి.డి.ఎస్ ఎలా పనిచేస్తుందంటే - మన ఇందాకటి ఉదాహరణ లో ఆ మిక్సీ మీద కద ఇన్సూరెన్సె తీసుకున్నది. ఇప్పుడు ఆ మిక్సీ పాడైపోదు అని నమ్మి ఇంకొకళ్ళు దాని మీద పందెం కాసారనుకుందాం. ఆ పందెం ని ఇన్సూరె చేసే ప్రక్రియే సి.డి.ఎస్!! అర్థం కాలేదా? అర్థం అయితే ఇంతదాకా వచ్చేది కాదంటారా? అది ఒకంతుకు నిజమే లేండి. (నిజం చెప్పండి.. ఇది కనక అర్థం అయితే మీకు derivatives market లో ఉజ్వల భవిషత్తు ఉన్నట్టే.) ఈ సి.డి.ఎస్ ఎల పని చేస్తుంది అని మన గురుమావయ్య కూడా చెప్పారు. ఐనా అర్థం కాలేదా? అంతే లేండి. వారెన్ బఫ్ఫెట్ కే బోధపడలేదు - మిమ్మల్ని కించ పరచడం లేదు సుమి. అన్ని వేల కోట్లు షేర్ మార్కెట్ లో సంపాదించిన అటువంటి వ్యక్తికే అర్థం కాదంటే మనకి కొంచం కష్టం కద.

పోని ఇది ట్రై చేయండి. ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర ఒక పుస్తకం ఉందనుకుందాం. అది అసలు వస్తువు. ఓకే నా? ఇప్పుడు ఆ పుస్తకా ప్రతిబింబాన్ని అమ్మామనుకోండి.. అది షేర్. అంటే స్టాక్ సర్టిఫికేట్ అన్నమాట (పుస్తకాన్ని కంపనీ అనుకుంటే, కంపనీ లో ఒక భాగం ఒక షేర్) ఇంతదాకా అర్థం అయ్యింది కద. ఇప్పుడు ఆ అద్దన్నికి ఎదురుగా ఇంకొక అద్దం పెట్టం అనుకోండి. అంటే ప్రతిబింబం యొక్క ప్రతిబింబం దాన్ని అమ్మితే.. అది derivative అన్నమాట. ఇల ఒక 10,000 అద్దాలు పెట్టుకుంటు పోయి ప్రతి ఒక్క ప్రతిబింబాన్ని అమ్మితే అది derivatives market!!!! అందులోని ప్రతి ప్రతిబింబాన్ని ఇన్సూర్ చేసేది సి.డి.ఎస్. ఇలా ఇన్సూర్ చేసిన కంపనీల్లో ఒకటి ఏ.ఐ.జి. (AIG. )మధ్యలో యే ఒక్క అద్దం పాడైనా, ప్రతిబింబం సరిగ్గ అగుపడకపోయినా మిగితావన్ని ఢమాల్!! అదే జరిగింది A.I.G విషయం లో.

ఇప్పుడు చెప్పండి బాగా అర్థం అయ్యిందా? ఇలా వేల వేల ప్రతిబింబాల్లో యే ఒక్కటి కూడా చెక్కు చెదరదు అని అతి వీర భయంకరమైన లెక్కలేసారు. ఇక్కడ ప్రతిబింబాలకి బదులుగా, CDOs, CDS అని భావించాలి. వీటిల్లో చాల మటుకు మార్టగేజులే కద ఉండేవి. అలా ఒక్కో సీ.డె.ఓ లో ఉన్నా మార్టగేజులు ఆధారంగా లెక్కలు వేసేవాళ్ళు. అంటే కొంతమంది గణిత శస్త్రం లో తోపులైన భారతీయులని అల పిలిచి ఇవి ఫేల్ అయ్యే probability లెక్కగట్టమనే వాళ్ళట, ఐ-బ్యాంకుల్లో!!! ఈ లెక్కలంటికి ఆధారం ఒక్కటే - ఇంటి ధరలు ఎప్పటికీ ఎప్పటెప్పటికి పదివేల సంవత్సరాలకి, కలియుగాంతం వరకి ఇలనే ప్రతియేడు పెరుగుతునే ఉంటాయి అని భావించడం. అసలు ఈ rise of home prices ఒక్కే ఒక్క దిశగా సాగుతుంది అన్ని నమ్మివేసిన లెక్కలు మరి ఎల ఉంటాయో ఇప్పుడు చూస్తున్నాం.

ఇవన్నీ ఒక ఎత్తైతే అసలు ఈ derivatives market మిద అసలంటు నిఘ లేకుండా చూడ్డం మరో ఎత్తు. దీనికి కారణం 2000 లో వచ్చిన ఒక చట్టం. దాన్నే Commodity Futures Modernization Act of 2000 అని అంటారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ల్ క్లింటన్ దీన్ని అమల్లోకి తెచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ హౌసింగ్ బూం (housing boom) కి పునాది గురించి కూడా చెప్పుకోవాలి. అది మరుసటి టపాలో. అంత వరకు..

0 comments:

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP