Sunday, April 5, 2009

ఏకానమి - 2 : ఒక "మేధావి" ఆలోచన (CDOs)

ఎకానమి ఇల అవ్వకముందు తాతకముందు అంటే కేవలం ఒక్క సంవత్సరం ముందన్నమాట అనూష్కాలా అందంగా ఉన్నప్పటిమాట ఇది. ఆ రోజుల్లో ఇప్పటిలాకాకుండా "ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్"లు ఉండేవి. వీటికి మన వీధి చివర్ల్లోని బ్యాంకులకి కొంచం తేడ ఉంది. వీధి చివర్ల్లోని బ్యాంకులని ముచ్చటగా "కమర్షియల్ బ్యాంక్"లని కూడా అంటారు. అంటే వీళ్ళేమో మన డబ్బులని చెకింగో సేవింగో యకౌంట్ల రూపంలో తీసుకొని వాటి మీద పరమ చెత్త వడ్డిలు ఇస్తారు (అంటే చెకింగ్ యకౌంట్ మీద 1% వడ్డి, సేవింగ్ యకౌంట్ మీద 3-5% వడ్డి) మనం దాచుకున్న డబ్బుని పద్ధతిగా అప్పులు తిరిగిచ్చే వాళ్ళనే ఎంచుకొని మరీ అప్పులు ఇచ్చేవాళ్ళు. ఇదిలా ఉండగా ఇంటిపేరు తప్ప ఇంక ఏమీ సంబంధం లేని "ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్"లు (ఐ-బ్యాంకులు) విపరీతమైన వడ్డిలతో బోలెడన్ని రిస్కులతో నడిచేవి. కంపనీలకి డబ్బు అవసరం వస్తే వాటి షేర్లు అమ్మిపెట్టేదానికి ఈ ఐ-బ్యాంకుల సహాయం తీసుకునేవి. అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు మధ్యవర్తి లాంటివి.. కంపనీల షేర్లు కొనేదానికి మంచి పార్టీ ని అలగే కంపనీలకి కొంచం ఎక్కువ డబ్బు ఒచ్చేట్టు చూసేవాళ్ళు. (ఐ-బ్యాంకులు ఇంకా చాలా పనులు కూడా చేస్తారు.. అందులో ప్రథమంగా ఇది).

1929 లో ఒచ్చిన "గ్రేట్ డిప్రెషన్" మూలానా ఆ రోజుల్లో అంటే 1933-35 ప్రాంతం లో ఒక చట్టం ప్రవేసపెట్టారు. దాన్నే "Glass-Steagall Act of 1933" అంటారు. దానివలన కమర్షియల్ బ్యాంకులు ఈ ఇన్వెస్ట్మెంత్ బ్యాంకుల పని చేయగలిగేవి కాదు. కమర్షియల్ బ్యాంకులపై చాల గట్టి నిబంధనలు ఉండేవి. ఈ చట్టాన్ని 1999 లో మార్చారు.. ఈ రోజు ఉన్న పరిస్థికి ఆ చట్టాన్ని రద్దుచేయడం కూడా ఒక కారణమే! ఆ విషయాలు మరో టపాలో చూద్దం.

అసలు విషయానికి వస్తే 80లో మాట ఇది. "Drexel Burnham Lambert" అనే బ్యాంక్ లో ఒక రోజు ఏమీ తోచక ఒక మేనేజరు మధ్యానం భోజనం చేసి ఇంట్లో పోరు ఆఫీసులో తన మేనేజరు పోరు పడలేక ఎదో ఒకటి చేద్దం అని నిర్ణయించుకుని, తన టీము ని పిలిచి "బాబులు మీరేం చేస్తారో నాకు తెలేదు కాని ఇక నుండి మన టీము మన కంపనీకే అత్యధిక సంపాదన తెచ్చిపెట్టలి. లేకుంటే మీకు ఊస్టింగే" అని సగటు మేనేజర్లలాగా గోల గోల చేసాడు. ఏం చేయాల్రా దేవుడా అని ఆ టీము సభ్యులు ఆలోచించగా ఒకడి పుర్రెలో ఒక మహత్తరమైన ఆలోచన మొలిచింది. "మన దగ్గర జనాల ఇళ్ళు, కంపనీలు, చదువులు గట్ర కి ఇచ్చిన అప్పులు ఉన్నాయి.. వాటిని అలానే ఉంచితే ప్రతి నెల వాళ్ళు కట్టే వడ్డి తప్ప ఏమి లాభం ఉండడం లేదు.. అన్నింటిని కొంచం కొంచం కలిపి ఒక డబ్బలో పెట్టీ వేరేవాళ్ళకి అమ్మేస్తే" ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. దాన్నే "Asset backed security" అని నామకరణం చేసాడు... అల అనడం కన్న కొంచం రొమాంటిక్ పేరు పెడదాం అని వాటినే "Collateralized debt obligations (CDOs)" అని పిలిచాడు.

అసలు ఇవి ఎలా పని చేస్తాయంటే ఉదాహరణకి ఒక కంపనీ - 50 మంది మంచి క్రెడిట్ ఉన్నవాళ్ళకి ఇంటికి లోనులు ఇచ్చయి అనుకుందాం. అలనే ఇంకొక 40 మంది ఎదో కొంచం మంచి క్రెడిట్ ఉన్నవాళ్ళకి ఇచ్చింది అనుకుందాం. ఇంకొక 10 క్రెడిట్ అస్సలుబాగోలేని అంటే నమ్మలేని వాళ్ళన్నమాట మన విజగశాంతి లాగన్నమాట ఇచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఆ మంచి క్రెడిట్ కాకుండా మిగిలిన వాళ్ళ అప్పులని వేరే బ్యాంకులని, ఇన్వెస్టర్లకి అమ్మడం ఎలా? అందుకే ఒక రెండు డబ్బాలు తయారు చేసింది ఆ అప్పులిచ్చిన బ్యాంక్. ప్రతి డబ్బలో 25 మంచివి, 20 మాములువి, 5 చెత్తవి వేసి రేటింగ్ ఏజెన్సీ కి పంపింది. అప్పటి వాళ్ళ లెక్కలు ప్రకారం ప్రతి డబ్బ రిస్కు చాలా తక్కువ (5 ఏ చెత్తవి కద) కాబట్టి AAA రేటింగ్ ఇచ్చేసేవి. ఇప్పుడు అప్పులిచ్చిన బ్యాంక్ వీటిని వేరే బ్యాంకులకి, ఇన్వెస్టర్లకి హాయిగా అమ్మేయచ్చు. అక్కడ మొదలైంది అసలు కథ. మొదట్లో రొమాన్స్సు బానే ఉన్నా తర్వత తర్వత నువ్వు నేను లో తెలంగాణా శకుంతల లా విశ్వరూపం చూపించాయి.

వచ్చేటపలో ఇంకొక మేధావి ఆలోచన ఫలం (credit default swap (CDS)) గురించి చెప్తా. అంతవరకు శెలవు.

4 comments:

జీడిపప్పు April 05, 2009 8:29 PM  

చక్కని ఉదాహరణలతో సరళమయిన పదజాలంతో చాలా బాగుంది వ్యాసం. Waiting for the next.

Unknown April 05, 2009 10:58 PM  

విషయం పైన మంచి అవగాహన కనపడుతోంది. శైలి సరదాగా, సరళంగా వుంది. చాలా బాగుంది వ్యాసం. వీలైతే వీటి గురించి గురు మామయ్య చెప్పిన టపా చూడండి.

Unknown April 05, 2009 11:08 PM  

http://hasyadurbar.blogspot.com/2008/12/8.html

Shashank April 06, 2009 8:07 AM  

@ బుడుగు, ప్రాసాద్ గారు - ధన్యవాదములండి.

ప్రసాద్ - గురు మావయ్య ఈ విషయం మీద రాసింది ఇంకా చదవలేదు (చదివి గుర్తులేదనుకుంటా అండి) మల్లి చదువుతా. విషయం మీద అవగాహన అన్నరు కద.. రెండేళ్ల నుండి చెప్తున్నా నేణు (అంటే ఆ సుబ్-ప్రైం మొదలైనప్పట్టినుండి) బాబు ఇది చాలా చాలా పెద్ద సమస్యా అని ఎవ్వరు వినలేదు. అందుకే కొంచం research చేయాల్సొచ్చింది. దాని ప్రభావమే. :) hopefully, the things i mentioned here are atleast informational, and truthful. If that's the case then my work is half done.

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP