Thursday, April 16, 2009

ఆకాశమంతా - just భరించగలిగేంత.

శంకారాభరణం, స్వర్ణకమలం, గోదావరి, గమ్యం ఇత్యాది సినిమాలు నచ్చడ్డం వలన నేను "క్లాసో" విజేంద్ర వర్మా, టైగర్ హరిస్చంద్రప్రసాద్, చిత్రం భలారే విచిత్రం, లేడిస్ టైలర్ లాంటి సినిమాలు నచ్చడ్డం వలన "మాసో" ఇంతదాకా అర్థం కాలేదు నాకు. బహుశా నాలాగా అందరూ అనుకుంటారేమో తెలేదు మరి. ఏ సోదంత ఎందుకురా అంటారా.. నిన్నా అంటే రెండు రోజులు పట్టింది లేండి .. ఆకాశమంతా చూసేసరికి. కొంతమంది ఇది చాలా క్లాస్ మూవీ నీకు నచ్చుద్ది అన్నరు.. ఇంకొంతమంది మామా ఇది మనకి ఎక్కదురా అన్నారు. సరే రజనీ, మాధురీ దీక్షీత్, జాకీ ష్రాఫ్ నటించిన "శంకర్" చిత్రం ఇప్పటికి ఒక 20 సార్లు చూసినవాడికి ఇదో లెక్క అని చూసా.

ఏంటో.. పరమ వరైటిగా అనిపించింది చిత్రం. ఒక్కర్తే కూతురు ఉంటే ఇలా ఉంటదా అని అనుమానం వచ్చింది కూడా. వెంట్టనే మా అక్క కి కాలా.. అక్కా నువ్వు ఒక్కర్తే కద ఇలా ఇలా ఉంటదా అని.. తనేమో ఇలా ఎగెస్ట్రాలు చేసింటే తనకి దెబ్బలి పడేవని, అలనే వాళ్ళ నానా అలా (సినెమా లో లా) చేసింటే ఎప్పుడో ఇంటి నుండి పారిపోయేదని చెప్పింది. అప్పుడు కొంచం కుదుటబడ్డ. ఇది నా అభిప్రాయం మాత్రమే. బహుశా అలాంటి తండ్రులు ఉన్నరేమో.. సినెమా లో ప్రకాష్ రాజ్ కి జూనియర్ వర్షన్ నేను చూశా / చూస్తూనే ఉన్నా. (ఎవరు అనేది ఇక్కడ చెప్పలేను .. స్వారీ) కానీ సినెమా లో లాగా "అంతా కూతురిమయం" ఎప్పుడు చూడలేదు.

ఒక్కరే ఉంటే అంటే ఒక్కర్తే అమ్మయి అయినా, ఒక్కడే అబ్బయి అయినా చాలా గారాబం అని ఒక అపనమ్మకం ఉంది ప్రజల్లో. అపనమ్మకం అని ఎందుకు అన్ననంటే నేను ఒక్కడినే కాని మా అమ్మ నానాలు నేను అడిగిన వెంట్టనే ఏది ఇవ్వలేదు. పైపెచ్చు ఇంట్లో అటు అమ్మయి కోటా పనులు ఇటు అబ్బయి కోటా పనులు చేయాల్సి వచ్చేది (మచ్చుక్కి - ఇళ్ళు చిమ్మి, ముగ్గు పెట్టడం మొదలు గంజ్ కి వెళ్ళి నెలకి సరిపడ సరుకులు తేవడం గట్ర వరకు అన్నమాట) చేయాల్సి వచ్చేది / చేయాల్సి వస్తోంది. సో.. ఎవ్వరాఇనా "త్రిషా ఒక్కర్తే అమ్మయి కద అందుకే అంత గారాభంగా పెరిగింది అంటే నేను ఒప్పుకోను"..

ఇంతకీ కథ ఏంటంటే - ఒక్కర్తే అమ్మయి ఉన్న తల్లిదండ్రుల కథ అన్నమాట. ఒక కూతురికి తన తండ్రికి మధ్యలో ఉండే మనోభావాలు. కొంచం గరం మసాలా, ఉప్పు, కారం, చింతపండు, మామిడి తొక్కు, కొబ్బెర పచ్చడి, టమాట పప్పు వేసి తయారు చేసింది. అంత వరైటీ తగ్గించింటే నచ్చేదేమో కాని ఇన్ని కలిపే సరికి టేస్ట్ మరోలా తయారయ్యింది. ప్రకాష్ రాజ్ కొన్ని చోట్ల అతిగా కొన్ని చోట్ల మామూల్గా చేసాడు. త్రిష కి పెద్దగా రోలు లేదు. ఐశ్వర్యా తల్లిగా బానే చేసింది. మిగితా వాళ్ళందరు లైట్.

సినెమా ఒక 30% నిజానికి దగ్గర్లో ఉందని ఖచితంగా చెప్పగలను. అంతకు మించి ఏమీ లేదు. చిత్రం భలారే విచిత్రం చూసి చూసి బోరు కొడితే ఇది చూడండి.. చూసాకా మళ్ళా చిత్రం భలారే విచిత్రం చూడచ్చు.

14 comments:

Anonymous,  April 17, 2009 12:16 AM  

అందరూ మీలాంటోళ్ళే. అడవి రాముడు చూస్తారు. శంకరాభరణం చూస్తారు. మనిషన్నాకా నవరసాలు కావాలి కదా.

అడవిరాముడికి పనిచేసిన జంధ్యాల, వేటూరి, మహదేవన్ లే శంకరాభరణానికి కూడా పని చేసారు.
కాకపోతే దర్శకుడే వేరు.
ఆ ముగ్గురే విశ్వనాథ్ తో పని చేస్తే శంకరాభరణం, రాఘవేంద్రరావుతో పని చేస్తే అడవిరాముడు వచ్చాయి.

Karthika April 17, 2009 12:45 AM  

ఇంట్లో అటు అమ్మయి కోటా పనులు ఇటు అబ్బయి కోటా పనులు చేయాల్సి వచ్చేది (మచ్చుక్కి - ఇళ్ళు చిమ్మి, ముగ్గు పెట్టడం మొదలు గంజ్ కి వెళ్ళి నెలకి సరిపడ సరుకులు తేవడం గట్ర వరకు అన్నమాట).

hehehe nenu full happy eroju :) baagayindi baagayindi.

baaga raasav review :).

Nuvvu chaala gr8 balakrishna,harikrishna yee cinema vadilinattu ledu ga hehehe :).

Anonymous,  April 17, 2009 2:36 AM  

మీకు విజయేంద్రవర్మ, టైగర్ హరిశ్చంద్రప్రసాద్ లాంటి నందమూరి వంశీయుల సినిమాలు, అదీ అట్టర్ ఫ్లాప్ సినిమాలు నచ్చాయంటే మీరు కమ్మ సామాజికవర్గం వారయి ఉంటారు ఖచ్చితంగా....

ఆ కులం కాకుండా విద్యావంతులలో నందమూరి వంశీయుల సినిమాలను మెచ్చేవారు ఉంటారని నేననుకోను

అయితే మీ రచనా శైలి, హాస్యం, వ్యంగ్యం, wit బాగున్నాయి.

Shashank April 17, 2009 7:41 AM  

@anon gAru - nA drusthilO vijEndra varma, tiger vanti hAsyaspada chitralu manaki chala arudu. dAnni Anandince daaniki kulaniki chendalsina avasaram leedanukunta.

ayina "kulam anedi naa curriculam lone leedu. neenu broadcast"

Shashank April 17, 2009 8:00 AM  

@బోనగిరి గారు - బగ చెప్పారండి. అయినా దర్శకేంద్రుని తొ ఎవ్వరు పని చేసిన final product ఒకటే లా ఉంటది అని నా నమ్మకం. అన్నమయ్య కి ఇద్దరు పెళ్ళాలు, రామాదాసు కి రొమాంటిక్ సాంగులు పెట్టిన "మహానుభావుడు". ;-)

అంటే అందరు నా లాగే అని విని చాలా సంతోషించానండి... అంతలో ఈ పిల్ల వ్యాఖ్య - @కార్తీకా - బాలయ్య, హరికృష్ణ ఏం ఖర్మ, D V Ranga rao అని ఒక గ్రేట్ దర్శకుడు ఉన్నాడు లే అతడి సినెమాలు కూడా almost అన్ని చూస... (మచ్చుక్కి - murder, నవ్వు నవ్వించు గట్ర గట్ర)

అయినా నేను మానసిక క్షోభ పడితే నువ్వు ఆనందిస్తావా? కుర్చి కి కట్టేసి నవ్వు నవ్వించు, శంకర్ చూపిస్తా. జార్గత్త... హమ్మ...

Karthika April 17, 2009 10:04 AM  

Ayina nuvvu nanu edipisthe nenu urukuntaana?chinna pillani chessi edipisthavaa nannu?

Baaga tikka kudirindii...
aa santosham lo parledu le nuvvu cheppina movies anni happy ga chusesthaa hehehe :)kurchi ki katteyalsina shrama kuda neeku undadu :).

Shashank April 17, 2009 10:13 AM  

neeku Sankar gurinchi teleedu le. aa great movie gurinchi inkoka post raasta. uttamudaina shashank ni ennesi maatalantunnav le.. chepta chepta..

Karthika April 17, 2009 10:20 AM  

hehehe
eroju matram nenu picha happy :).

Eppudu nannu edipisthav eroju naku chance vachindiii hahahaaaaa.

Avunaa sare,raayi mari twaragaa Sankar gurinchi.

Shashank April 17, 2009 10:36 AM  

naaku kopam teppnchavante Sankar movie DVD burn chesi post chesta. (ila ippatiki oka 10 mandiki panchaanu.. ) tarvata nuvvu hyd nundi arichina arupu naaku ikkada vinipistundi..

Karthika April 17, 2009 10:51 AM  

hehehe :)
enti neeku kopam kuda vastundaa?
Chadrudu ante cool cool kadaa.

నేస్తం April 22, 2009 11:52 AM  

హూం నేను చూడలేదు ఆ సినిమా ..మరీ సెంటిమెంట్ ఎక్కువ అయితే చూడలేను నేనూ కూడా :) కాని బాగుంది అన్నారు ఎవరో మరి ..

కొత్త పాళీ April 28, 2009 6:43 AM  

మీ రివ్యూ బాగుంది.
బోనగిరి గారి మాటలు కూడా రైటాన్!

Shashank May 08, 2009 11:53 PM  

@kottapALi gAru - :-D thanks.

@sivaprasad gAru - thanks anDi.

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP