Thursday, June 18, 2009

మా హిల్టన్ కి కన్నీటి వీడుకోలు - 1

జ్ఞాపకాలు. మన జీవితం ఎటువైపు పయనిస్తే బాగుంటుంది అని మనం భావిస్తామో దానికి పునాది మన గతమే అని నా అభిప్రాయాం. ప్రతి ఒక్కరికి కొన్ని మధురమైన జ్ఞాపకాలు కొన్ని ఖటినమైనవి ఉంటాయి. సాయాంసంధ్య వేళలో ఇంటి బయట కూర్చొని అస్తమిస్తున్న రవిని చూస్తూ తే నీళ్ళు తాగుతూ చల్లని గాలి వీస్తున్నప్పుడు వెనక ఎక్కడో కొద్ది దూరం లో "వే వేళ గోపెన్మల్ల మువ్వా గోపాలుడే.." పాట వినిపిస్తున్నప్పుడు చిన్నపుడు అంతగా చిన్నగా లేనప్పుడు జరిగినవి గుర్తొస్తాయి. ఆ రోజుల్లో... అని మనం అనుకుంటూ ఉంటాం. ఒక ప్రదేశమో లేక ఒక గుర్తో లేక ఒక ఫోటో చూసినప్పుడు వద్దనుకున్నా చాలా విషయాలు గుర్తుకొస్తాయి. ప్రదేశాలు చిన్నప్పటి గుర్తులు బహుశా మారుతాయి.చిన్నప్పుడు మనం తిరిగే ప్రదేశాలు చోట్లు ఎల్లప్పటికి అలనే ఉంటుంది అని భ్రమపడతాం. ఆశిస్తాం. కాని అల జరగడం ఇంచు మించు అసంభవమే. మార్పు తథ్యం కద. కాలాన్ని ఎవ్వరు ఆపలేరు.. కాలం కదలకుండా నిర్భంధించలేరు. అలాంటి కాలాన్ని ఒక్క క్షణమైన కదలకుండా ఎటువంటి మార్పు రాకుండా చెసే మన యత్నమే ఫోటో అని నేను భావిస్తాను. ఫోటో అనేది మనం కాలాన్ని జయించ్చే ప్రయత్నమే. కాలాని జయించడం అంటే ఒక ఫోటో తీసినప్పుడు ఆ క్షణాన్ని బంధిస్తాం .. భద్రపరుస్తాం... అంటే కాలాన్ని ఆ ఒక్క క్ష్ణమైన పర్లేదు.. కాని ఆ సమయాన్ని జయించి బంధించినట్టే కదా!

అలనే ఒకటి మా బడి కి వేళ్ళే దారిలో ఒక పెద్ద చెట్టు (గుల్మోహర్ అనుకుంటా) ఉండేది.. ఇంకా కూడా ఉంది. ప్రతి రోజు నడుచుకొని బడికి వెళ్ళేప్పుడు ఆ చెట్టుని ముట్టి వెళ్ళేవాళ్ళం. అల ఒక పది సంవత్సరాలు చేసింటా. మొన్నామధ్య దేశం కి వెళ్ళీనప్పుడు మా బడి వైపు వెల్తూంటే ఆ చెట్టు ని చూసినప్పుడు ఎన్నో ఎన్నెన్నో సంగతులు గుర్తొచ్చాయి. నేను మా అక్క రోజు అల నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అంటే మా బడి మొదటి గంట 9:10 కి కొట్టేవాళ్ళు నేనేమో 8:45 కి అల చేరాలి అని. అల చేరితే ఒక అరగంట ఆడుకోవచ్చని నా బాధ. మా అక్కేమో ఎందుకు లేరా హాయిగా 9:05 కి చేరుదాం అని. అల అప్పుడప్పుడు కలిసి వెళ్ళేవాళ్ళం కొన్ని కొన్ని సార్లు నేను ఇంట్లో రబస చేసి త్వరగా వెళ్ళిపోయేవాడ్ని. మా బడి ఇంటి నుండి ఓ పది పదిహేను నిమిషాల దూరం. కొంచం పెద్ద అయ్యేపాటికి మా అక్క పదవ తరగతి అయిపోయింది సో నేను ఒక్కడినే 9:15 కి చేరేవాడ్ని. of course అది చూసి మా అక్క నన్ను వీర బాదుడు బాదింది.

నేను ఒకటవ క్లాస్ లో ఉన్నప్పటి మాట. మా అక్క ఎమో ఐదు చదువుతోంది. బడి తర్వాత తను కరటే నేర్చుకునేది. నేను స్కూల్ లోనే ఎక్కడో ఆడుకుంటున్నాను. నేను మా అక్క క్లాస్ మేట్ ఒకడు. వాడేమో మా టీచర్ వాళ్ళ అబ్బాయి. ఎదో ఆడుకుంతున్నాం ఇసుకలో. సీన్ కట్ చేస్తే నేను వాడి మీద ఎక్కి బాటా బూటు తిరగేసి కొడుతున్నా. ఎందుకో నాకు గుర్తులేదు.. కని కొట్టడం మాత్రం బాగా గుర్తుంది. అప్పుడే మా ప్రిన్సిపాల్ వచ్చింది. ఇద్దరిని లాక్కెళ్ళి తిట్టింది (అనుకుంటా.. చెప్పా కద మొదటి తరగతి అని). మరుసటి రోజు ప్రొదున్న మా ఇంట్లో నేనేమో బడికి వెళ్ళను అని ఏదో ఒక నెపం ట్రై చేస్తున్నా. మా అమ్మ కి అనుమానం వచ్చింది. ప్రొద్దునైతే స్కూలు స్కూలు (ఆ ఆ వింటున్నా.. చిన్నప్పుడు స్కూల్ అంటే ఇష్టం నాకు. తర్వత తర్వత ఎల ఎగ్గొట్టాలా అని యోచించేవాడ్ని అది వేరే విషయం) అనే వాడూ వీడికేమొచ్చింది అని. అయినా సరే స్కూల్ వద్దు వద్దు అని నేను. జ్వరం అని చెప్ప పొట్టలో నెప్పి అని చెప్ప.. మా అమ్మ మాత్రం ఏది వినడం లేదు. మా నాన్న అప్పుడు మా అక్కని పిలిచి అడిగారు - ఏంటి వీడు ఇలా అని. మా అక్క చెప్పింది అప్పుడు ఇలా నిన్న సాయంత్రం వీడు ఇంకొకడు కొట్టుకున్నారు వీడు వాడ్ని బూటు తో కొట్టాడు అని. అప్పుడు చెప్పా నేను మెళ్ళగా నాన్న నన్ను బూట్ల మీద మూడు పేజీల వ్యాసం రాయమన్నది మా టీచర్ అని. నాకు పట్టుమని పది పదాలు కూడా రావు నేను మూడు పేజీలు రాయడం ఏంటో అని మైండ్ బ్లాక్ అయి స్కూల్ ఎగ్గొడదాం అని ప్లాన్ వేసా. కాని కుదరలేదు. మా అమ్మ వచ్చింది అనుకుంట నాతో ఆ రోజు.

ఇంకో సారి నేను నలుగు చదువుతున్నా. అయితే మా బడి లో 11 కి ఒక పది నిమిషాల బ్రేక్ ఇచ్చేవారు. 11 అయ్యేపాటికి గంట కొడితే పరిగెత్తుకుంటూ బయటకి వెళ్ళాను .. ఎవరో అటునుండి పరిగెత్తు కుంటూ వచ్చారు. అదొక్కటే గుర్తు నాకు. తర్వత గాల్లో ఒక 2-3 చక్కర్లు కొట్టి ఎటో పడ్డాను. గట్టి గట్టిగా ఏడుస్తుంటే తెలిసింది నా కుడి చేయి కొంచం డామేజ్ అయ్యింది అని. అప్పుడు ఎవరో వెళ్ళి మా అక్క కి చెప్పారు.. ఇలా వాడి చేయి విరిగింది అని. తనకి ఆ రోజు ఏదో పిట్ట పరీక్ష ఉండే... అది మధ్యలో ఆపి మరి వచ్చింది పాపాం. తను వచ్చే వరకు నేను అలా ఏడుస్తూనే ఉన్నా. నా ఏడుపు నెప్పి కంటే ఇంట్లో మా అమ్మ నా వీపు ఎల విమానం మోత మోగిస్తుందో అని భయం తో. చేయి విరగలేదు కాని కొంచం జరిగింది. అంటే dislocate అయ్యింది నా ఎముకలు. అయినా మ అక్క ని కాక పట్టి ఇంట్లో చెప్పద్దు అని ఒప్పించా. కాని ఏం చేస్తాం. నెప్పి. వాపు. భోజనం కూడా చేయలేక పోయా. అప్పుడు మళ్ళా మా అక్క ని పిలిచి అడిగితే చెప్పింది ఇలా అయ్యింది అని. మరుసటి రోజు మా నాన్న సెలవు పెట్టి నా చేతికి పట్టి కట్టించారు. ఇదే వంకా అని ఓ పది రోజులు స్కూల్ లో రాసే పని తప్పింది. :)

ఇంకో సారి .. ఇది వర్షా కాలం లో. నేను ఐదవ తరగతి లో ఉండినాను. అప్పటికి నాకు జ్ఞానోదయం అయ్యి బాటా బూట్లు మానేసి క్యాన్వాస్ వాడేవాడ్ని. బాటా అంటే మళ్ళా పాలిష్ గట్ర చేసుకోవాలి. పుట్టెడు బద్దకం ఉన్న నాకు అలాంటివి సుతరాగు పడవు. ఆ క్యాన్వాస్ రోడ్ల మీద రాచీ రాచి కొంచం చిల్లు పడ్డది. అది ఇంట్లో చెప్తే తిట్లుపడతాయి అని చెప్పలేదు. వర్షం.. దాంతో నా షూ మొత్తం తడిసిపోయింది. అలనే మా క్లాస్ లోకి వెళ్ళి కొంచం ఆరబెట్టుకుందాం అని తీసా. ఇంతలో మా శ్రీ గాడు ఫుట్ బాల్ కి నా షూ కి తేడా తెలీక దాన్ని తన్నాడు. అల అల మా గ్యాంగ్ మొత్తం నా షూ ని ఫుట్ బాల్ లా ఆడుకుంటున్నారు. శ్రీ గాడు నా షూ ని తీసి మా గోడ మీద కొట్టాడు. అంతే! అదేదో గుర్తులాగా నా షూ అచ్చు తెల్లటి మా స్కూల్ గోడ మీద పడ్డది. అలనే మళ్ళా సున్నం వేసే వరకు అంటే దాదాపుగా ఇంకో 3-4 యేళ్ళు ఆ అచ్చు అలానే ఉండిపోయింది.

అర్రెర్రే అసలు నేను చెబుదాం అనుకున్న విషయం వేరు చెప్తోంది వేరు. మా బడి ముచ్చట్లు కాదు నేను అనుకున్నది. పెద్దయ్యాక అంటే ఇంజినీరింగ్ అప్పుడు ఎన్నేన్నో లెక్కకు మించిన జ్ఞాపకాలకు సాక్షం గా ఉండిన మా హిల్టన్ కేఫ్ ని మూసేసారట. ఈ హిల్టన్ అంటే ఊస్మానీ విశ్వవిద్యాలం దగ్గర్లో ఉండేది. ఆ చుట్టు పక్కళ్ళో చదివిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి సుపరిచితమైనది ఇది. మా ఇళ్ళలో కంటే ఎక్కువ సేపు అక్కడే ఉండేవాళ్ళాం. అలాంటి మా హిల్టం మూసేసారు అని తెలిసింది. ఆ విషాదాన్ని అందరితో పంచుకుందాం అనుకున్నా. ప్చ్.. సరె అది వచ్చే టప లో వ్రాస్తా. అంత దాకా సెలవు.

9 comments:

రాధిక June 18, 2009 1:00 PM  

చాలా విషయాలు గుర్తుచేసారు పాపం మీ అక్క :)

karthika June 18, 2009 2:44 PM  

hmmm idemi trend babu?

ento topic petti last varaku inka edo cheppi asalu title ki post ki em sambhandam undi ani full tension tho chaduthe last lo edo 2 lines rasiii...

Next part undaa inka ani.. ento kadaa?

Ne post chadivakaa na tala gira gira tirugutundiii kasta next part lo ayina main matter rayii babu heheh :).

Veena,  June 18, 2009 7:21 PM  

chaala baaga raasav
yenni saarlu yedo oka paata photo chooso or paata vinadamo tho kammukocche gnaapakaalatho gunde baruvekkaddam...

Shashank June 18, 2009 11:02 PM  

@ రాధిక గారు - మా అక్కకి ఏంటండి హాయిగా నా తో పనులు చేయించుకొని ఉంది.

@పింకీ - చెప్పా కద రాద్దం అనుకున్నది ఒకటి కాని మైండ్ డైవర్ట్ అయ్యి స్కూల్ విషేషాలు రాసాను. ప్చ్ నువ్వు ఇంతలా ఫీల్ ఔతావ్ అనుకోలే. పోనిలే next time నుండి పోస్ట్ కి టైటల్ కి లింక్ ఉండేలా చూస్తా. ఓ కే నా?

@వీణక్క - :)

హరే కృష్ణ . June 19, 2009 12:46 AM  

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
ఇంట్లో పెద్ద వాళ్ళు వుంటే ఎప్పుడూ ఇలానే జరుగుతుంది :(
పోస్ట్ బాగా నచ్చింది
బద్ధకం అంటే ఒక పోస్ట్ రాయాలి దాని గురుండి..నీ బద్ధకం బాగుంది నేను పోస్ట్ చూడగానే పారిస్ హిల్టన్ ఏమో అనుకున్నా..నిజం ఆఖరున తెలిసేలా చేసావ్

Karthika June 19, 2009 7:10 AM  

hmm ok ok aa matram bayam undali lee heheh :).

twaragaa rayii next part :).

Shashank June 19, 2009 8:09 AM  

హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే

ప్రొదున్నే ఇలా జపం చేయించావ్. మంచిది. బద్దకం గురించి పోస్టా.. అది ఎంత కష్టమో తెలుసా? అయినా ట్రై చేయి.
ఏం బాబు పారిస్ హిల్టన్ అనుకున్నావా? మా బాబే.. "మా హిల్టన్" అని ఎందుకు అంటా అప్పుడు? బుడుగు ల అయ్యింది నీ తెలివి కూడా.

Anonymous,  June 19, 2009 12:39 PM  

Subhalaganam lo Srilakshmi ki maatalau vacchaka eppudo chinnatham vi anni cheppinattu..nuvventi title ki post ki sambandham lekundaa raasthunnav??

Shashank June 20, 2009 9:29 AM  

అబ దబ జబ

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP