Wednesday, June 10, 2009

ఏం తీసుకోను చెప్మా...

గత కొద్ది రోజుల నుండి నేను చలా చాలా చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాను ఈ విషయం. ముందుగా నా లాప్పీ గురించి కొంచం చెప్తా. నా లాప్పీ ఇంక బాల్చి తన్నేసినట్టు ఉంది. తల్లి రేకు అదే మదర్ బోర్డ్ మార్చిన తర్వత ఎంచక్కా ఒక 5-6 గంటలు పని చేసింది.. తర్వత మళ్ళా పోరా అనేసి పడుకుంది. ఎంత ప్రయట్నించినా ఇంక లాభం లేకపోయింది. CPR కూడా ట్రై చేసా.. కాని "చిత్రం విడుదలైన రోజే ప్రేక్షకులు తెర చింపేసిర్రు అని విన్న ప్రొడ్యూసర్" లెక్క శబ్ధం లేకుండా సైడ్ కి సెట్ అయ్యింది. ఇంక చేసేది ఏమీ లేక కొత్తది కొన్నా. lenovo. ఇప్పటిదాకా అయితే బానే అనిపిస్తోంది. వీస్టా ఇచ్చాడు with automatic upgrade to Win XP. ఇంతక ముందు వీస్టా వాడిన అనుభవం తో వెంఠనే మార్చేసా.

పోతే.. ఆల్రెడి పోయింది అంటే ఏం చెప్పలేను.. చాలా ఆలోచిస్తున్నా అని చెప్పాకద. అదేంటంటే ఇంకొద్ది రోజులు దివ్య పుట్టిన రోజు వస్తుంది. ఇంతదాకా ఏం కొనాలో ఆలోచించలేదు. పూలు, చాక్లెట్ చెత్త చెదారాం అని అనకండి. అవి ఆలోచించేసీ రిసైకల్ బిన్ లో పడేశా. నా బ్లాగు చదివే ఆడ లేడిస్ మరియూ ఇంతక ముందు బహుమతులు ఇచ్చిన boyses కొంచం సహాయం చేయండి. కొన్ని బహుమతి ఆలోచనలు (for the linguistically challenged - gift ideas) ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్.

ఏం ఏం వద్దో చెప్తా - నెక్లేస్లు (మొన్నే చెప్ప కద మిషన్ షాపింగ్ లో - కొనేసింది అని), చెప్పులు, హ్యండ్ బ్యాగులు, అత్తర్లు. ఇవ్వన్నీ మా స్నేహితురాలు చెప్పింది కొట్టేసా కూడా. ఇలాంటివి ఏమి కాకుండా కొంచం "మంచివి" మీకు తోస్తే చెప్పండి ప్లీజ్. ఎక్కడికైన బయటకి వెళ్ళండి అని అనకండి. అది ఓ రెండు నెలలు నాకు కష్టం. వారాంతాలు కూడా పని చేస్తున్నా. ఇంకేమైన ఆలోచించండి.

అప్పటికీ అడిగాను దివ్య ని - నీకేమి సర్ ప్రైస్ గిఫ్ట్ కావాలో చెప్పు అని. అయినా చెప్పలేదు. ఏం చేసేది. నాకు తోచినవన్ని తిరస్కరించేసా. అందుకే మీ లాంటి మేధావుల్ని అడుగుతున్నా. కొంచం సహాయం చేసి పుణ్యం కట్టుకోండి.

11 comments:

హరే కృష్ణ . June 11, 2009 12:04 AM  

చాలా ఆలోచించా ప్చ్చ్చ్ ...లాభం లేదు అని
నీ కోసం కష్టపడి గూగుల్ లో గిఫ్టు+గర్ల్ ఫ్రెండ్ అని సెర్చ్ చేశా
http://answers.google.com/answers/threadview/id/765994.html
చాలా సమాధానాలు ఉన్నాయి..డిసైడ్ చెయ్యాల్సింది నువ్వే!

హరే కృష్ణ . June 11, 2009 12:06 AM  

"చిత్రం విడుదలైన రోజే ప్రేక్షకులు తెర చింపేసిర్రు అని విన్న ప్రొడ్యూసర్" లెక్క శబ్ధం లేకుండా సైడ్ కి సెట్ అయ్యింది

చాలా బావుంది పంచ్

నేస్తం June 11, 2009 3:22 AM  

మరీ సర్ ప్రైజ్ చెయాలంటే ఏమీ ఇవ్వకండి :P
ఆ తరువాత సంవత్సరం దెప్పితే నా పూచీ కాదు.. :)

...Padmarpita... June 11, 2009 4:21 AM  

నేస్తం చెప్పిందే కరెక్టు.....

Shashank June 11, 2009 7:32 AM  

ఏమి ఇవ్వద్దా? ఈ ఐడియా ఏదో బాగుందే... కొంచం ఆలోచించాల్సిన విషయం. వచ్చే సంవత్సరం వరకు దెప్పితే నేస్తం, పద్మా - మీరైపోయారు.

Haneesha June 11, 2009 8:05 PM  

India style lo oka cheera konukkellu :D

adhi kaadhante, thana hobbies batti evanna ivvocchu :D

Shashank June 12, 2009 7:55 AM  

hanee - unnave kattedaaniki occasions leevu antundi. inkokati ante anthe

budugu - adi tippi naa nettina kodutundi. ayina prestige cooker to tana kante naake pani ekkuva.. :-D

Haneesha June 12, 2009 5:15 PM  

thana hobies cheppu. giftu memu cheppataaniki try chesthaam :D

Haneesha June 12, 2009 5:17 PM  

itta kaadhu kaani, o diamond ring icchei :D assalu kaadhandhu!

spandan June 13, 2009 6:20 AM  

antaga yenduku alochinchadamu?techi
echinavi nee special gift ela avutundi guru?nee rhudayanubhutini shabdala to andamuga alli oka chakkati rachana malika, kevalam tanakosame wrasi aa CD ni tanaku ankitam chesey....CD viney tappudu matram neevu divya pakkan undoddu.

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP