Tuesday, June 16, 2009

i want to break free..

జీవితం లొ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏం చేస్తున్నానా అని. బహుశా ఇది చాలా మందిని కాలం తన్ని మరీ అడిగే ప్రశ్నే. ఏం చేస్తున్నానా అంటే ఈ రోజు ఈ పూటా ఈ క్షణం అని కాదు జీవితం తో జీవితం లో ఏం చేస్తున్నానా అని. అలా రోజులు గడిచిపోతోంది నెలలు సంవత్సరాలు కాని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందనట్టు అక్కడే అదే ఫార్ చక్రాలు (టెన్షన్ పడకండి నేనన్నది for loops అని) కాలా చక్రాం లో రాసుకుపోతున్నా.

ఎనిమిది తొమ్మిది యేళ్ళగా రాసిన ఫార్ చక్రాలే రాసీ రాసీ అలసిపోయా. 8085 మొదలుకొని వివిధ భాషల్లో రాసి ఇదిగో ఇప్పుడు లేటెస్ట్ గా .NET లో వెలగబెడుతున్నా. కాని ఏమి మార్పు లేదు .. ప్రతి రెండు మూడేళ్ళకి మారిన బిరుదు, జన్మానికో శివరాత్రి లా మారే జీతం తప్ప. అన్నమయ్య కూడా వివిధ రసాల్లో సంకీర్తనలు వ్రాసారు. ఒక సారి "భావాయామి గోపాలాబాలం మనఃసేవితం చింత్యే అహం సదా" అని మరో సారి "ఫలనేత్రానల ప్రబల విధుల్లతకేలి" అన్నారు. నేను మాత్రం for(int i =0; i < నా జీవితం; i++) అని రాస్తునే ఉన్నాను.

పరిస్థితులు బాలేనప్పుడు ఏంటీ గోల అంటే మరి మరి పరిస్థితులు బాగున్నప్పుడు కూడా ఇలా అప్పుడప్పుడు అనిపించేది నాకు. తప్పుపట్టకండి.. నేను చేస్తున్న పని నాకు నచ్చే నాకిష్టం వచ్చే చేస్తున్నా. కాని నా ఆవేదన పని మీద కాదు నా మీద. రెంటికి D. రంగా రావ్ సినిమాకి కే. విశ్వనాథుని సినిమాకి ఉన్నంత వ్యత్యాసం ఉంది. (డి. రంగా రావ్ ఎవరు అంటే అతనో మహానుభావుడు. "నవ్వు నవ్వించు", "మర్డర్" లాంటీ కళని, చూసిన వాల కలల్ని, ఖండించే చిత్రాలు తీసిన గొప్ప వ్యాక్తి. గుర్తొచ్చింది నవ్వు నవ్వించు చిత్రం రివ్యు కోసం వేచు చూస్తూండండి. శంకర్ రేంజి మూవి. చూడకపోతే వెంట్టనే వెళ్ళి చూడండి. థియేటర్ లో కాదు DVD లో. ఆ చిత్రాన్ని థియేటర్ లో ఎవ్వరు చూడలేరు.)

ఈ ఫార్ చక్రాలు వైల్ (while) చక్రాలనుండి i want to break free. కాని ఎలా అన్నదే నా బుర్రకి తోచడం లేదు. ఎంత సేపు "దత్తం పెట్టి" (అదే database) కి అనుసంధానం సరిగ్గా ఉందా ఉంటే కూడా రాసిన కోడు ఎందుకు పనిచేయడం లేదు చెప్మా ఉప్మా అని అనుకోవడం తోనే సరిపోతోంది. చస్స్.. ఏదో రాద్దాం అనుకొని ఏదో రాయబోయి ఏదో రాస్తున్నా. నా బుర్రని ఇప్పుడు లక్ష దిక్కుల్లో శతకోటి ఆలోచనలు పీకుతున్నాయి. అందుకే ఇలా సటిలాయిట్ సిగ్నల్ అందని జి.పి.యస్ లా ఉన్నా. ఇరవై నాలుగు గంట్టల్లో కనిష్టం ఒక 10 గంటలి ఇలా కోడు రాసి డీబగ్ చేస్తుంటే పిచ్చి పిచ్చి ఆలోచనల్తో ఇదేనా జీవితం అంటే? నాకు విముక్తి లేదా ? అని అనుకుంటున్నప్పుడు మహాకవి శ్రీ శ్రీ గారన్నది గుర్తొచింది:

నేను సైతం కోడూ ప్రపంచానికి లూపు ఒక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం కోడూ వ్రుష్టికి if ఒక్కటి రాసిపెట్టాను
నేను సైతం వెబ్బు ఘోషకు bug ఒక్కటి పట్టి చంపాను

ఆ మాహాకవే అలా అన్నాక ఇంక చేసేది ఏమీ లేదని ఈ ఫార్ వ్యూహం లో - దర్శకేంద్రుని చేత్లో చిక్కిన ద్రాక్ష లా, వరం సినిమా నిర్మాత లా - చేసేది ఏమీ లేక .. ఏమీ చేయలేక నా బ్రేక్ పాయింట్ చేరే వరకు అలా తిరుగుతునే ఉందాం అని డిసైడ్ అయ్యాను. చూద్దాం.. బాలయ్యే కామెడి ట్రై చేయగాలేంది నేను ఈ లూపు నుండి బ్రేక్ అవ్వలేనా?

9 comments:

Varunudu June 16, 2009 6:20 PM  

అంత బుర్ర బద్దలు కొట్టెసుకోవడం దేనికి ? జీవితం మరీ నిస్సారమై పోతోంది అనుకొంటే.. నీకు కొన్ని హాబీలు, అభిరుచులు అనేవి ఉంటాయి కదా.. వాటిని ఆచరణ లో పెట్టు. ఉదాహరణకు.. నీకు ఇలా వ్యాసాలు వ్రాయడం ఇష్టం కదా.. కత్తి లాంటి టాపిక్ తీసుకొని వ్రాయి. లేదు నీకు క్రికెట్ ఆడడం ఇష్టం అనుకో.. ఆడు.. కాదన్నది ఎవరు?

పోనీ అవీ బాగా విసుగొచ్చేసిందా.. దేశం ఉంది కదా.. ఎదో ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని, నలుగురైదుగురు జీడిపప్పు, బాదంపప్పు లాంటి మిత్రుల్ని వెంటేసుకొని, అలా దేశం చుట్టి రా.. ఆటోమాటిక్ గా జీవితం మళ్ళీ గాడిలో పడుతుంది..

ఇదీ జరిగే పని కాదు అంటే.. ఏం కావాలనుకొంటున్నావో.. జీవితం లో ఇంత దాకా ఏదైనా చెయ్యాలనుకొని, చెయ్యలేక పోయినవి.. ఒక చల్లటి సాయంత్రం శ్రీమతి ఇచ్చిన టీ సేవిస్తూ.. ఒక పెన్నూ పేపరూ తీసుకొని వ్రాయి. ఏం చేస్తే ఆనందంగా ఉండగలను అనుకొంటున్నావో అదీ వ్రాయి.. అదెంత కష్టసాధయమైనా, అసంభవమైనా ముందైతే వ్రాయి. ! తర్వాతా... ఆ పని చెయ్యడానికి నీకున్న ఆటంకాలు అవరోధాలు ఏవో అవీ వ్రాయి. వాటికి పరిష్కారం ఏదో నీకు తోచినంత వరకూ వ్రాయి.. మొత్తమంతా వ్రాశాక ఒక సారి చదివి.. దాని సారాంశం గ్రహించి ... మా లాంటి మిత్రుల సలహాలు స్వీకరించి ... ఆ పని చెయ్యడానికి తలపెట్టు... నెమ్మదిగా చిన్న స్థాయిలో మొదలెట్టి.. ఒక్కో మెట్టూ ఎక్కు.. ఆనందం అదే వెతుక్కొంటూ వస్తుంది.

అట్టాంటివి నాకు ఏమీ లేవు అంటావా.. అదే నీ నిరాశా భరిత నిస్సర జీవననికి కారణం.. !

చిన్నప్పుడు పెద్దళ్ళ కోసం చదివి....
పెద్దయ్యాక జీవించటానికి ఉద్యోగమేదో చేసి..

దాంతొ జీవితం పరిపూర్ణమై పోయింది.. అనుకొంటే.. ఇదిగో ఇలానే ఉంటుంది.. సో ఆలస్యమెందుకు.. కమాన్.. మొదలెట్టు..

గో విధాతా గో

జీడిపప్పు June 16, 2009 7:32 PM  

@ వరుణ్ - :) దేశం చుట్టొస్తే మనోడు అల్లూరి సీతారామరాజు అవుతాడేమో... కి క్కి క్కీ
అసలు విషయానికొస్తే - ఇంతకు ముందు ఉద్యోగంలో నెలరోజులపాటు లీవు లేకుండా పని చేసాను. project live ఇంకో వారం రోజులు ఉందనగా ఒక రోజు నిద్ర లేచి "i'm taking off today" అని మెయిల్ కొట్టి 12 వరకు నిద్రపోయి ఆ తర్వాత చికెన్ బిర్యానీ తిని గాడ్ ఫాదర్ సినిమా రెండు పార్టులూ ఇంకో రెండు సినిమాలు చూసాను. అప్పటికి కుదుటపడింది ప్రాణం. so i can feel it విధాతా, i can feel it.

దీనికి పరిష్కారం ఉందా అంటే.. ఏమో! కాకపోతే Job is just a driving factor of life. Job is NOT life అని గాఠ్ఠిగా నమ్మి ఫాలో అవుతున్నా, ఇతర వ్యాపకాల పైన ఆసక్తి పెంచుకుంటూ. so far so good.. not sure about the future!!

Shashank June 16, 2009 10:10 PM  

గురు.. సలహాకి తుంబ థ్యాంక్సులు. కాని ఒక్క విషయం.. నాకు మధ్యలో ఒక్కప్పుడూ ఉద్యోగం లేక ఇంట్లో కూర్చొని ఎదో ఒక జాబు వస్తే చాలు అని కూడా అనుకున్న సంధర్బాలు ఉన్నాయి. చెప్పొచేదేంటంటే దివ్య కి టీ పెట్టడం రాదు. అదోకటి. ఇంకొకటి నేను ఈ అవద్ధులన్నీ దాటేసిన వాడ్ని. ఈ లూపు నుండి బ్రేక్ అయ్యే దానికి ప్రణాలిక ఏర్పాటు చేస్తున్నే ఉన్నా.. అంత దాకా ఇది తప్పదు కద.. అప్పుడప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటది. బుడుగు లాగా.. అందరు నీకు మళ్ళే స్థితప్రజ్ఞులు కాదు కద గురు.. :ప్

Veena,  June 16, 2009 10:40 PM  

baaga chepparu varunudu gaaru and jeedipappu - godfather and chicken biriyani neeku sarvaroga nivaarini kada mari :)

idi nee temporary vairagyam aithe ok, serious gaa alaa anipisthe - reason alochinchu, work vallanaa, personal life lo you are not doing anything that gives you fun/personal satisfaction etc vallanaa ani..
reason telusukunnaka, oka tapaa raayi, solutions tho appudu mundukostham :)

హరే కృష్ణ . June 17, 2009 1:06 AM  

శశాంక్ కొంచెం ఆలస్యంగా చూసాను..ఇంత బాధలో కూడా ఎంత బాగా రాసావ్.. హాట్స్ ఆన్..
నీ పరిస్థితి కొంచెం నాలానే ఏడిచింది..చెప్పేవారు చాలా చెప్తారు అది అమలుపరచడం అటువంటి పరిస్థితుల్లో చాలా కష్టం
మొన్ననే ఒక 10 మంది తెలుగు వాళ్ళతో వాళ్ళ రూం కి వెళ్లి రాంబాబు క్యారెక్టర్ తో రెండు రోజులు ఆడుకున్నాక కాస్త ప్రశాంతత దొరికింది
ఇంత మంది ఫాన్స్ వున్నాం అనే విషయం గుర్తుపెట్టుకో బ్లాగ్ రోజూ రాయడం కష్టమే ,బాలయ్యే కామెడి ట్రై చేయగాలేంది మనం +మొదటి కామెంట్ కంట్రోల్ వి

నేను సైతం కోడూ ప్రపంచానికి లూపు ఒక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం కోడూ వ్రుష్టికి if ఒక్కటి రాసిపెట్టాను
నేను సైతం వెబ్బు ఘోషకు bug ఒక్కటి పట్టి చంపాను

చూడు ఎంత బాగా రాసావో ..

చెప్పడం మరిచా, మన ఇద్దరి అని నేను అనను కేవలం నా కారణంగా ఆవిడ ఆ బ్లాగ్ ని మూసివేయడం జరిగింది (మాననుబూతులు )

తృష్ణ June 17, 2009 3:45 AM  

విధాతగారూ,జీవితంలో ఏమి సాధించాము అనే ప్రశ్నకి ఫుల్స్టాప్ లేదండి.అది అంతులేని సాగరమధనం.సాధించేకొద్దీ గమ్యం ఇంకా ఇంకా సుదూరమౌతుంది.అది ఒక క్షితిజం.ఇంట్లోనో,దగ్గరలోనో ఎవరైనా చిన్నపిల్లలుంటే ఓ అరగంట మిమ్మల్ని మేరు మర్చిపోయి వాళ్ళతొ ఆడి చూడండి;లూప్ నుంచి బ్రేక్ అదేదొరుకుతుంది.

Anonymous,  June 17, 2009 5:52 AM  

జీవితం ఒక నాటకం నాయనా..
మనకు ఇష్టమున్నా, లేకపోయినా దేవుడు మనకిచ్చిన పాత్ర పొషించవలసిందే.

దానికి తోడు సొసైటీ ఒకటి. సొసైటీలో బతకాలంటే దానికిష్టమైన రీతిలోనే బతకాలి. మనకి నచ్చినట్టు బతకాలంటే యేటికి ఎదురీదాల్సిందే.

Shashank June 17, 2009 7:53 AM  

@అక్క - :-) నాకు ఇల అనిపించినప్పుడు నీ బుర్ర తింట కద.. ఆ సౌకర్యం నాకు ఉండగా నాకు చింత యేల దండగా. బుడుగు సంగతి తెలిసిందే కద.. సికెన్ బిర్యాని ఒక చిప్పలో, టి.వి. లో గాడ్ ఫాధర్ పెడితే చాలు.

మీరందరు బాగా చెప్పారు. చాలా చాలా థాంక్స్. హరే నేను నువ్వే కాదు ఇలా infinite లూప్ లో ఇర్రుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. నేను సరిగ్గా వ్యక్తపరచలేదనుకుంటా I like what I am doing. there is no question about that. మధ్యలో అంటే కొద్ది రోజుల క్రితం project management వైపు వెళ్ళాను. పెద్దగ ప్రొడక్తివ్ గా ఏమీ చేయకుండా దినమంతా ఫోన్ల మీద మీటింగుల్లో ఉన్నట్టు అనిపించి నా వళ్ళ కాక మళ్ళా ప్రోగ్రామింగ్ లోకి వచ్చేశా . :)

తృష్ణ, బోనగిరి గారు - నాకు ఒక రోజులో 24 గంటలు సరిపోవు .. ఆపీసు పని వళ్ళ కాదు ఆఫీసేతర వ్యాపకాల వళ్ళ. this is just a passing phase.. ఇంకో రెండు మూడు రోజుల్లో మళ్ళా నార్మల్ కి వచ్చేస్తా. చాలా థాంక్స్. :)

హ.కృ- చి చి మన వళ్ళ ఒకరు బ్లాగు మూసేసారు అంటే చాలా బాధగా ఉంది. సారి చెప్పాలి ఆవిడకి పాపాం.

kiran.vemuri June 22, 2009 10:39 AM  

baagundi raa ee post.. mari intha desperation lo vunnavani ippudee ardham ayyindi..

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP