Friday, October 2, 2009

కృష్ణమ్మ కొంచం కోపం తగ్గించుకోమ్మ..

గత వందేళ్ళళ్ళో ఎన్నడులేనంత ఆంధ్ర దేశం లో వరద ప్రాంతం ఏర్కొన్నది. భాస్కర్ దీన్ని *పాలనా వ్యవస్థల అట్టర్ ఫైల్యూర్* అన్నారు. కాని ఒక్కటి అసలు ఇంత వస్తుంది అని కలలో కూడా ఎవ్వరు ఊహించిండరు. కేవలం శ్రీ వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం తప్ప ఇంక ఎవ్వరు ఊహించలేదు ఇది. ప్రతి యేట వచ్చే వరదలని తట్టుకునే .. అలాంటివి వచ్చిన వెంట్టనే ఆదుకునే సత్త మాత్రమే మన ప్రభుత్వానికి ఉంది. అంతే తప్ప ఇలా ఇంత భారి లెవెల్ లో వరదలు వస్తే ఎవ్వరు ఏమీ చేయలేరన్నది నా అభిప్రాయం. మన దేశమే కాదు అసలు ఎక్కడ ఎవ్వరు ఈ లెవెల్ లో వరదలని ఎదుర్కునేంత లేదు. (please correct me if I am wrong).

ఇందాకే డా|| జయప్రకాష్ నారాయణ్ గారు చెప్పారు - ప్రపంచంలో యే ప్రభుత్వం / ప్రపంచలోని అన్ని ప్రభుత్వాలు కలిసి పని చేసిన మూడుగంటల్లో మూడులక్షల మందిని మూవ్ చేయలేరు అని. అది వాస్తవమే. మూడు రోజులుగా కురుస్తున్న భారి వర్షాలని తప్పు అంచనా వేసిందా మన ప్రభుత్వం అంటే .. అది నిజమే. కాని ఇంత లా ఔతుంది అని ఎవ్వరు ఊహించలేదు.

ఇప్పుడు సమయం రాత్రి 11:10 దేశం లో.శ్రీశైలం గరిష్ట స్థాయికి చేరుకుంది అట. మొత్తం 11 గేట్లు 43 అడుగులు ఎత్తివేసారు అట. 889 అడుగుల నీటిమట్టం చేరుకుంది. ఇంకా ఈ రోజో రేపో "మేము నీళ్ళు ఇవ్వము వదలము దాచుకుంటాం గిన్నేలో బిందెల్లో పోసుకొని ఇంటి భూగర్భం లో పెట్టుకుంటాం" అన్ని ఇన్నేళ్ళు అన్న పొరుగురాష్ట్రం ఇంకో ఇరవై లక్షల క్యూసెక్ల వరద నీరు విడుదల చేస్తుంది అట. అది రేపు మధ్యానానికో సాయంత్రానికో శ్రీశైలం చేరుకుంటుంది. కర్నూలు అప్పటికి ఉంటుందనే ఆశిస్తున్నాను. నా భయం.. శ్రీశైలానికి పొరబాటున అటు ఇటు ఏమైన జరిగితే మొత్తం నాగార్జున సాగర్ మీద పడుతుంది..

నాగార్జున సాగర్ గరిష్ట నీటిమట్టం చేరుకుంటుంది అని అంచనా వేస్తున్నారు ఇంకొద్ది గంట్టల్లో. అక్కడ 26 గేట్లు ఎత్తేసారు. రేపు మధ్యానానికి మొత్తం లెవెల్ లో ఎత్తేసే అవకాశాలు ఉన్నాయి అట. ఇంక మిగిలింది ప్రకాశం. ప్రకాసం 12 గేట్లు ఇప్పుడు 6 అడుగులు ఎత్తేసారు. రేపు మధ్యానానికి ఆరులక్షల క్యూసెక్ల నీరు చేరుతుంది అట బెజవాడ కి. కర్నూల్ లో కరెంట్ తీసేసారు. ల్యాండ్ లైన్లు లేవు. కేవలం సెల్ మీదే నడుస్తోంది. ఇంకా భారి వర్షాలు పడుతున్నాయి మన రాష్ట్రం లో.. అలనే కర్ణాటకలో కూడానూ. ఇంకో ఇరవై నాలుగు చాలా క్లిష్ట పరిస్థితి మన రాష్ట్రానికి కొన్ని జిల్లాలకి ....

Update: రేపు ప్రొదున్నకి మద్రాసు నుండి 30 పవర్ బోట్లు చేరుతాయి అట కర్నూల్ నగరం. అలనే కర్ణాటక 20 లక్ష క్యూసెక్లు వరద నీరు ఒదిలేసింది. దీని వళ్ళ రేపు ప్రొదున్నకి ఇంకో పది అడుగులు .. పది అడుగులు నీరు పెరుగుతుంది అట కర్నూల్ నగరం లో.

Update సమయం తెల్లవారి 3:15. జూలార 60 గేట్లు తెరిచేసారు అట. శ్రీశైలం లో నీటి ప్రవాహం ఇప్పుడు 891 అడుగులకి చేరుకుంది!!!! శ్రీశైలం గరిష్ట ఎత్తు 885 అడుగులు. దేవుని మీద భారం వేసి సైట్ నుండి వెళ్ళిపోయారట ఇంజనీర్లు.

8 comments:

Bhãskar Rãmarãju October 02, 2009 1:58 PM  

విపత్తులను ఎదుర్కోటంలో పాలనా వ్యవస్థ అట్టర్ ఫ్లాప్ అయ్యింది అని నా భావం.

ఇలాంటి ప్రకృతి విలయతాండవాలను ఎవ్వరూ ఊహించరు. అందుకే దాన్ని దిజాస్టర్స్ అంటాం. ఇక్కడ కావాల్సింది డిజాస్టర్స్ ని తట్టుకుని నిల్చోగల యంత్రాంగం. ఇలాంటి వరద భీభత్సాలను ఎవ్వరూ ఊహించకపోయినా, మన ప్రభుత, ప్రభుత్వ పాలనా యంత్రాంగం, సపోర్టెడ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క *రిస్క్ ఎసెస్మెంట్* *దూరదృష్టి* లని శంకించాల్సిందే.
అవి సరైన రీతిలో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెట్టిఉంటే నష్టశాతాన్ని తగ్గించవచ్చు అనేది నా భావన.

Shashank October 02, 2009 2:09 PM  

ఒక్కటి గురు.. సునామి వచ్చేవరకు మనం సిద్ధంగా లేము.. తర్వత భూకంపం వస్తే సునామి ప్రమాదం వస్తే సూచించే యంత్రంగ అన్ని సిద్దం చేసారు. దివిసీమ వరదలు తర్వత ఆ లెవెల్ లో కాకున్న కొంచం తక్కువ లెవెల్ లొ తట్టుకోగలము. కని ఇది కొంచం కష్టం to predict and to be prepared for

Anonymous,  October 02, 2009 4:51 PM  

Shashank
diviseema did not get floods. It was cyclonic storm. uppena is different from varada. In those days the weather technology was not this much improved to warn people in divi seema

Sravya V October 02, 2009 8:37 PM  

మేము నీళ్ళు ఇవ్వము వదలము దాచుకుంటాం గిన్నేలో బిందెల్లో పోసుకొని ఇంటి భూగర్భం లో పెట్టుకుంటాం" అన్ని ఇన్నేళ్ళు అన్న పొరుగురాష్ట్రం ఇంకో ఇరవై లక్షల క్యూసెక్ల వరద నీరు విడుదల చేస్తుంది అట. >>నిజం శశాంక్ గారు నాకు ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చినపుడల్లా అనుకుంటాను ఒక్క చుక్క నీళ్ళు కూడా ఇప్పుడు కూడా వదలద్దు ఏమి చేస్తారో చేసుకోండి అని చెప్పాలి అని.

Shashank October 02, 2009 11:20 PM  

@అజ్ఞాత - నా ఉద్దేశం అదే.. కాని వరద వార్తలు చూడ్డంతో తుఫాను కి బదులు వరద అని వ్రాసాను.

@శ్రావ్య - బా చెప్పారు. మాకు నీళ్ళు వద్దు ఎక్కడ దాచుకుంటారో మీ ఖర్మ అని ఒదిలేయాలి.. కాని మనకి ఆ వీలు లేదు కదమ్మ..

ఎదైతేనేమి కర్నూల్, పాలమూరులో నీటి ప్రభావం కొంచం తగ్గింది అని అంటున్నారు. బహుశా సాయంత్రానికి ఎమైన మేలుపడుతుందేమో. మనిషి ఆశావాది కద..

సుజాత వేల్పూరి October 03, 2009 1:09 AM  

"వరద వచ్చాక చూసుకోవచ్చులెద్దూ"అనుకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. వరద రావడానికి సరిగ్గా 24 గంటల ముందే సాగర్ మీది నుంచి హైదరాబాదు వస్తూ 'నీళ్ళు తక్కువే ఉన్నాయి"అనుకున్నాను. ప్రకృతి క్షణాల్లో ఎలా తారు మారు చేస్తుందో అనిపించింది ఇవాళ చూస్తుంటే! ఇందులో సగం మానవ తప్పిదం వల్ల జరిగిన విధ్వంసమే!

శ్రావ్య,
బాగా చెప్పారు. కానీ వాళ్ళు పరిస్థితి విషమిస్తే వాళ్ళు వదిలేదాకా నీళ్ళు ఆగవుగా! ఆనకట్టను మట్టి చేసైనా మన మీదకు వచ్చి పడతాయి.

కానీ క్రస్ట్ గేట్లు దాటి 9 అడుగుల ఎత్తున ప్రవహిస్తున్న వరద నీటిని అంచనా వేయడం, నియంత్రించడం ..రెండూ కష్టమైన విషయమే!

చదువరి October 03, 2009 1:58 AM  

మీరనేది నిజమే. ఊహించనంత ఎక్కువ వరద కర్నూలును ముంచెత్తింది. నివారణ చర్యలు తీసుకునే సమయం లేకపోయింది. సమయం ఉన్న కారణంచేత విజయవాడలో ముందస్తు చర్యలు చురుగ్గానే సాగుతున్నట్టున్నాయి.

Shashank October 03, 2009 10:04 AM  

సుజాత - అంతే కదండి. ప్రకృతి ముంది మనం తోక ఝాడించలేము. ఒక్క రోజులో ఇంత వర్షం కురవడం అది అదృష్టమో దురదృష్టమో తెలీడం లేదు.

చదువరి - బెజవడ లో ఐనా పనులు జరపకపోతే "ప్రజా ప్రతినిదులని" వెతికి మరి కొడతారు.

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP