క్రికెట్ తెలియనివాడు ...
అనగనగనగనగా ఒక ఊరిలో బుజ్జిగాడు అనే ఓ కుర్రాడు ఉండేవాడు. వాడు ఎలా ఉన్నా.. వాడ్ని అందరు ఇంచు మించు గా హీరో రాజా లా (మేధావి లా) చూసేవారు. అంటే ఊర్లో కష్టాలు లేకున్నా ఏదో ఒకటి చేసి కొంచం కష్టం గా దాన్ని చిత్రీకరించి ఉపాయాలు చెప్పేవాడు. అందరు వాడ్ని బాగా చూసుకునేవారు. ఊర్లో కాస్తో కూస్తో కొంచం జ్ఞానం బుద్ధి ఉన్నవాళ్ళళ్ళో ఒకడిగా అందరి అభిమానం పొందాడు. ఇలా ఉండగ పక్క ఊరునుండి ఒకడు వచ్చి బుజ్జిగాడి మేధస్సు చూసి "మామూలుగా రండి మేధవులుగా పొండి" అనే పోటికి పంపమని ఆ ఊరువాళ్ళతో చెప్పాడు. ఊరు పరువు పేరు నిలబెట్టాలి అని చెప్పి పెద్దలు నిర్ణయించి బుజ్జిగాడికి ఓ తోడు ఇచ్చి ఆ పోటి కి పంపారు.
బుజ్జిగాడు వాడి స్నేహితుడు పోటి జరుగుతున్న స్థలానికి చేరారు. మొత్తం ఇంకా అన్ని ప్రదేశాల నుండి ఓ వంద మంది వచ్చారు. అసలు పోటిల్లో పాల్గొనే అర్హత ఉందో లేదో అని ముందు చిన్న చిన్న పరీక్షలు పెట్టి మొత్తం మీద ఓ ఆరు మందిని ఎన్నుకున్నారు. ఇంక పోటిలూ ప్రారంభమైయ్యాయి. మొదటిది ఏంటంటే మూడు అగ్గిపుల్లల్తో ముప్పై మందికి మూడు రకలా వంటలు చేసి పెట్టాలి. ఇలాంటివి మన బుజ్జిగాడికి పప్పుతో పెట్టిన విద్య .. వెంట్టనే మూడు పుల్లల్ల్ని వేరు వేరు చేసి మూడు గిన్నెల కింద పెట్టి చక చక వంట చేసేసాడు. పోటిలో మొదటి స్థానాన్ని సంపాదించాడు. రెండో పోటి ఐస్కాంతం తో ఓ కాంత ని ఆకర్షించాలి. ఇది కూడా చిల్లర పని కాబట్టి నిమిషాల్లో చేసేసాడు. ఇలా ఐదు విడతల పోటిల తర్వాత మొదటి స్థానం లో బుజ్జిగాడు నిల్చున్నాడు. ఇంక ఫలితాలు చెప్పే సమయం అయ్యింది.. అందరు ఇంక బుజ్జిగాడికే వస్తుంది అని ఎదురుచూస్తున్నారు. బుజ్జిగాడు కూడా విజయగర్వం తో అందరికి చేతులు ఊపుతు నిల్చున్నాడు. కాని చివరి క్షణంలో ఆ పోటి విజేత విజేంద్ర వర్మ అని చెప్పేసరికి ఎనలేని నిరాశ నిస్ప్రుహతో స్ప్రుహ కోల్పోయాడు బుజ్జిగాడు. ఇంక జీవితం మీద విరక్తి కలిగి అలా అలా నడుచుకుంటు దగ్గర్లో ఉన్న అడివిలోకి వెళ్ళి తపస్సు మొదలెట్టాడు. కొద్ది రోజులు తర్వత ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమైయ్యాడు. అప్పుడు బుజ్జిగాడు అడిగిన ఏకైక ప్రశ్న అన్నింటిలోను తాను ముందుండగా మేధావి అనే బిరుదు మాత్రం వేరేవాడికి ఎలా వచ్చింది అని. అప్పుడు ఆ పరమేశ్వరుడు "నీకు దైవ క్రీడ్ ఐన క్రికెట్ అంటే ఇష్టం లేకపోవడమే కారణం బుజ్జి" అని. ఆ మాటకి అవాక్కైన బుజ్జికి మించు ఇంచు గా మతి భ్రమించింది. "దేవా.. దేవాది దేవా మహాదేవా ....ఏంటి మీరంటుందేది. కొంచం వివరంగా చెప్పగలరు" అని పరిపరివిధములుగా ప్రార్థించగా ఆ పరమేశ్వరుడు చిన్నగా నవ్వి చెప్పడం ఆరంభించాడు -
ఒకానొకప్పుడు దేవుళ్ళు దూర్వస ముని శాపము వలన వారి శక్తులు అన్ని కోల్పోయారు. అప్పుడు వాళ్ళందరు విష్ణు మూర్తిని స్తుతించగా విష్ణుమూర్తి సంతుషూటుడై వారికి వారి గతవాఇభవం చేరూకే ఒక ఉపాయము చెప్పెను. క్షేరసాగరాన్ని మదించి అందులోనుండి వెలువడిన అమ్రుతాన్ని సేవించినచో దేవుళ్ళకి వారి గత వైభవం తిరిగివచ్చునని తెలిపెను. దేవుళ్ళు ఒక్కరే ఆ సాగరాన్ని మదించలేరు కాబట్టి వారి చుట్టలైన అసురులని కూడా ఆహ్వానించిరి. అలా ఇరువురు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా పెట్టి మదనాన్ని ఆరంభించిరి. హాలాహలము, కామధేనువు గట్ర అన్ని వచ్చాక అమృతం బయటకి వచ్చెను. ఆ అమృతానికి దేవుళ్ళు అసురులు కొట్లాడుకోవడం ఆరంభించారు. ఆ కొట్లాటని పరిష్కరించేదానికి కనుగొనబడిన క్రీడ ఈ క్రికెట్. ఆ రోజు జరిగిన మ్యాచ్ కి అంపైర్ గా వ్యవరించినది సాక్షాత్తూ ఆ బ్రహ్మే. మధ్యలో అసురులు వీరవిపరీతం గా విజ్రుంభిస్తూంటే వారి ఆటని దెబ్బకొట్టేదానికి విష్ణుమూర్తి మోహిని గా వచ్చే సరికి ఆ సుందరిని చూస్తూ మతిచెడి అసురులు ఓడిపోయారు. అలాంటి ఆటని హేళన చేసినందుకును ఇష్టపడనందుకును నీకు ఆ బిరుదు రాలేదు.
ఇది విన్న బుజ్జిగాడికి కళ్ళు చెమ్మగిల్లాయి.. ఐతే దేవా ఈ క్రీడని తెల్లోళ్ళకి ఎందుకు ఇచ్చినట్టు? ఇది మన జాతీయ క్రీడ అవ్వాలి కద? అని అడిగాడు. అందుకు ఆ మహదేవుడి ఇలా సెలవిచ్చాడు - "భారతీయులకి ఓ భయంకరమైన జబ్బు ఉంది. అది ఎందుకు ఎలా వచ్చింది అనేది ఇప్పుడు అసంధర్భం కావున చెప్పడం లేదు.. కాని ఆ జబ్బేంటంటే 'భారతీయులకి - పొరుగింటి పుళ్ళకూర రుచి! మనది, మన దేశానిది మన వాళ్ళూ అంటే చచ్చిన అవళంబించరు సరికద అపహాసం చేస్తారు. అందుకనే ఈ క్రీడని తెల్లోళ్ళకి అంటగట్టాల్సి వచ్చింది. అలా అయినా మనవాళ్ళు దీన్ని పుళ్ళకూరంత రుచిగా చూసుకుంటారని. ఇప్పుడు జరుగుతుండేది అదే కద!" ఇలా చెప్పేసరికి బుజ్జిగాడికి బోధిచెట్టుకింద కూర్చున్నంత జ్ఞానమొచ్చి ఇలా అన్నడు:
ఖగపతితోడన్ క్షీరసాగరము మదించగన్,
తగువున్ చేదించుటకు విధాత తలపుగన్,
జన్మనొందెన్ ఈ మహోనత క్రికెట్ క్రీడన్,
క్రికెట్ తెలియనివాడు దున్నపోతై పుట్టున్..
గమనిక: ఈ టపా ఎవ్వరిని ఉద్దేసించి వ్రాసినదికాదు. 'నేను-నేనుగా' యే 'నేస్తా'ల సహాయం లేకుండా రాసినది. ఎవరినైన బాధ కలిగిస్తే కేసేసుకోండి. నేను దానికి బదులుగా ముందే ఓ రెండు మూడు కేసులేసేస్తా.
14 comments:
ఫిక్షన్ మొదలెట్టావా ! ఫ్లాష్ బాక్ అదిరింది.. కరెక్ట్ పొరుగింటి దే మనకు బాగా అనిపిస్తుంది :D
విజేంద్ర వర్మనా.. హ హ్హ
Disclaimer kooda :))
హ హ హ భలే నవ్వించారు ! అసలు అక్కడ నుంచి ఎక్కడకు తీసుకెళ్ళారు recent గా ఏమయినా వ్రతాలు గట్రా చూసారా ?:)
awesome shashi.
idi chadivi naa wife vijayendra varma yevaru ani adigindi. appatlo vachina review choopicha :) Yekkadaina aa review ni upload chesi daaniki link pettu janala soukaryartham.
-Hemanth
అందుకేనా మోహినీల బదులు చీర్ లీడర్స్ ని పిలిపిస్తున్నారు 20ట్వంటీ మేచ్ లకు.. కేవలం క్రికెట్ కి వ్యతిరేఖం గా పోస్ట్ రాసినందుకు మీరు ఈ రేంజ్ లో పగ తీర్చుకుంటుంటే ఈ క్రికెట్ పిచ్చి తో ఆ మహాసాద్విని ఇంకెంత బాధ పెడుతుండి ఉంటారు కదా ..కేసు నేను వేయను ..వేయించేలా చేస్తా... దివ్య గారు ఓ మారు ఇలా వస్తే కాసింత మాట్లాడాలి. :)
పద్యం ఫరవాలేదు. కానీ చిక్కంతా ఈ ఆఖరి పాదం తోనే "క్రికెట్ తెలియనివాడు దున్నపోతై పుట్టున్.. క్రికెట్ తెలియక పోతే కదా దున్నపోతై పుట్టాల్సింది. హమ్మయ్య! మాకు క్రికెట్ తెలుసు.ఐనా నేను నేస్తం గారి కామెంటుతో ఏకీభవిస్తాను.
గమనిక:మీరు తిట్టినాసరె!
@ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
:p ఉన్నమాటే కద గురు.
@శ్రావ్యా - recent గ కాదు కాని ప్రతి వ్రత కథ ఇలే ఉంటుంది కద. ఎక్కడినుండో ఎక్కడికో వెళ్తారు. నాకు భలే ఇష్టం ఆ కథలు. :)
@ హేము - అది online ఎక్కడో ఉండాలి రా. వెతికి లంకె పెడతాలే. ఇంతకీ ఆ రెవ్యూ ఉందా? కావాలా? మేల్ లో ఉంది నా కాడ.
@ నేస్తం - హి హి.. మీరక్కడే పాయసం లో కాలేసారు. తనకి చిన్నపటినుండి (మా మామగారు) అలవాటే. పెళ్ళైయాక ఇక్కడి NFL అనే గొప్ప క్రీడ ని కూడా అలవాటు చేసా. మొత్తం చూడదు.. కాని ఎవరెవరు స్కోర్ ఎంత.. శని - ఆదివారాలు సోఫా నుండి కదలను అని తెలుసు. అటు టి.వీ లో NFl లాపి లో క్రికెట్. ఇదిగాక సౌభాగ్యం వేరొకటి గలదే..
మీవారితో ఓ సారి మాట్లాడాలి. నెమ్మదిగా మీకు క్రికెట్ అలవాటు చేయమని..
ఐనా క్రికెట్ లో చీర్ లీడర్లు అంతగా బాగోరు... అదే అమెరికన్ ఫుట్బాల్ లో ఐతే న... న సామిరంగ.. ఆ కథే వేరు.
@సునిత - అసలు రాద్దామనుకున్నది "క్రికెట్ ఆశ్వాదించనివాడు.." అని.. కాని మర్చిపోయా.. తింటూ / college football చూస్తూ రాసా.. మిస్సైంది. ఇప్పటికైన మించింది ఏమి లేదు వెళ్ళి క్రికెట్ గురించి తెలుసుకురండి.. పుణ్యము పురుషార్థమును...
vammo nuvu takkuvodivi em kaadu.cricket ante istam ani telsu but intha laa create chesantha ani matram teliduu.
hahahaa baagundi
చాలా బాగుంది.
మోహిని అంటే చీర లీడరా?
పింకి - ఉన్నమాటే. మా జాతీయ క్రీడని అంటే మరి..
అక్క - :P
బోనగిరి - నారాయణ నారాయణ. ఇప్పటి వాళ్ళని మోహిని లా ఉన్నారు అంటున్నా..
:):) అద్దిరింది అద్దెచ్చా!!
ఐతే ఇది మాత్రం కెవ్వు
నేస్తం - అందుకేనా మోహినీల బదులు చీర్ లీడర్స్ ని పిలిపిస్తున్నారు
good one :)
Yo Dude, You 2 EyNnaaRai ? Me too..Shame 2 shame.
Bai Dha Vey, Shtory supharu. Gintha Talent UNchkoni, Internet lo time kharaab cheyskoku thambi. O Sithram thiyyaaley, andharenee Naavvinchi pampaaley.
Anyways, Good creativity. Thanks much for sharing.
Post a Comment