Saturday, October 3, 2009

Wake Up Sid - My Experience

నిన్న చూసా ఈ చిత్రం. బాగా అనిపించింది. చాలా రోజులు తర్వత ఓ మంచి కాఫీ లాంటి సినెమా చూస్తున్నట్టూ అనిపించింది. చెట్లెనకాలా పుట్లెనకాలా పెరిగెత్తే పాటలు లేవు.. తాతా ముత్తాతా ని తలుచుకుంటూ సోది లేదు.. కార్లు గాల్లో పల్టీలు కొట్టడాలు ఒక్క గుండు తో ఓ సైన్యాన్ని చంపేడలు లాంటివి అస్సలు లేదు. అలగే తేజా టైప్ "టీనేజ్ రొమాన్స్" లేదు. చాలా మెచూర్డ్ గా ఉంది మూవీ. దాదాపుగా నిజజీవితం లో జరిగేట్టే ఉంది. మన సినెమాల్లో అరుదుగా కనిపించే నిజాయతి ఉంది.

సిడ్ ఉరఫ్ సిద్ధార్త్ అంటే రనబీర్ కష్టపడి అప్పుడప్పుడు పాసయ్యే రకం అన్నమాట. రేపు పరీక్ష అంటే ఈ రోజు వన్-డే బ్యాట్టింగ్ లాగా అన్నమాట. మనలో (అంటే మాలో) సగం పైన ఇదే పద్ధతి తో గట్టెక్కాం .. బండిని లాక్కుంటు వచ్చాం. దానికి ఓ కిటుకు ఉంది.. పాత ప్రశ్నాపత్రాలని తిరగేస్తే ఓ అంచన వస్తుంది ఎలాంటి ప్రశ్నలు రావచ్చో అని.. మసిపూసి మారేడుకాయ చేయడం మాత్రమే మిగులుతుంది.. అలా కాకుండా పాపం ఒక్క రోజు ముందు టెక్స్ట్ బూక్ తిరిగేయడం మొదలెడతాడు. ఇంక పరినామం అర్థం అయినట్టే కద!!! పరీక్ష హాల్ లో ఏటు నుండి ఏటు చూసిన ముక్క అర్థం కాదు.. నాకైతే నా ఇంజరీనింగ్ ఫస్ట్ సెం లో ఓ పరీక్ష గుర్తొచ్చింది. (డీటేల్స్ అడగొద్దు.. శాస్త్రి గారి పలుకు ప్రకారం "ఉందిగా సెప్టెంబరు మార్చి పైనా... " అనుకోవడమే..)

ఫైనల్ పరీక్ష తర్వాతా రేపటి నుండి అదేగో గొప్ప ఘణకార్యం చేసినట్టు ఇంట్లో బయట అందరు "ఇంకేంట్రా పెద్దోడివైపోయావు" అని అంటారు. ఒక్క రోజులో విధ్యార్థి దశ నుండి నిరుద్యోగి దశ కి చేరుకుంటాం. కనీసం పరీక్ష ఫలితాలు వచ్చేవరకి కూడా ఆగరు. అదేంటో. అదో మన్మోహన్ (అదే చిదంబర) రహశ్యం. అలా ఒక్కరోజులో "పెద్ద"వాడైపోకుండా నిరసిస్తున్న సిడ్ కథే ఈ చిత్రం. బొంబాయి ని చాలా అందం గా చూపించారు. బొంబాయి అంటే గుర్తొచ్చింది.. సినెమా మొత్తం అందరు బొంబాయి ని బొంబాయి అనే.. సారి సారి "ముంబాయి" ని బొంబాయి అని అన్నారని శివ సేన ధర్నా చేసిందట. అస్సలు పనిలేకుండా ఉన్నట్టు ఉన్నారు వాళ్ళు.

చాలా మెచూర్డ్ గా డీల్ చేసాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. బ్యానర్ .. ధర్మా ప్రొడక్షన్స్ .. కరణ్ జోహర్ ది.. చూసి దడుసుకొని జడుసుకొని కొంచం భయపడి ఎగ్గొట్టేద్దాం అని చాలా రోజులక్రితమే ఆలోచనమొదలెట్టా. కాని కరణ్ దర్శకత్వం కాదు కద అని కొంచం ఊపిరిపీల్చుకొని సాహసించా. బయటకి హాయిగా వచ్చాం. బ్యానర్ ని బట్టి మూవిలని కొలచకూడదని తెలుసుకున్నా. కొంకణా సేన్ గురించి చెప్పెక్కరలేదు. ఎటువైంటి పాత్రకైన న్యాయం చేస్తుంది. ఇందులోను అంతే. ఒక కొత్త ఊరికి వస్తే.. వచ్చిన మొదట్లో ఎలా ఉంటుందో అని మరోసారి గుర్తుచేసింది. అమెరికా కీ వచ్చినప్పుడు నాకు తెలిసినవాడు ఒక్కడు కూడా లేడు మా కాలేజి లో. అసలు హైదరబాదు దాటి ఒక్కడినే నేను వెళ్ళీన గరిష్ట దూరం దిల్లీ. అదెక్కడ అమెరికా ఎక్కడ. కొత్త ఊరూ కొత్త వాతావర్ణం.. మళ్ళా ఆ రోజులు గుర్తొచ్చాయి ఈ మూవీ చూస్తూంటే. చిన్నప్పటి స్నేహితులని విడిచి వస్తున్నప్పుడు కలిగిన బాధ... తర్వాత తర్వాత కొద్ది కాలానికే పరిచయమైన కొత్త స్నేహితులు.... కాలక్రమేన వీళ్ళు ఆ ప్రాణ స్నేహితుల జాబితాలోకి చేరిపోతారు. అది సహజం.. మన నైజం. ఇవ్వనిటితోబాటు తల్లిదండ్రులతో ఘర్షణలు.. అన్ని ఉన్నాయి ఇందులో. ఒక్క సీన్ మాత్రం చింపేసారు. ఎంత authentic గా ఉందంటే I am sure everyone can identify themselves with that.

చివరగా ఓ మాట. ఇది ప్రేమ కథే. కాని పదో తరగతో కాలేజో ప్రేమ కథ కాదు. అందుకే చూడండి అంటున్నా. వీలైతే. ఇంతకంటే సినెమా గురించి చెప్పడం కష్టం. చెప్తే మీకు కథ చెప్పేసినట్టు ఉంటూంది.. చెప్పకపోతే కూడా కష్టమే. సో పొరబాటున కథ ఎమైన చెప్పెస్తె క్షమించేయండి.

1 comments:

హరే కృష్ణ October 09, 2009 12:13 PM  

ముంబై ని అందం గా చుపించాడా సౌత్ ముంబై అయ్యి వుంటుంది షూటింగ్ ప్రదేశం DVD వచ్హేసింది రేపు చూస్తా ! కర్రెక్ట్ శివ శేన కి పని ఏం లేదు ఇక్కడ..:)

will tell d response in weekend

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP